మరో చరిత్రకు సిద్ధమైన గాంధీ ఆసుపత్రి | Gandhi Hospital Turns To Plasma Trials Against Covid-19 | Sakshi
Sakshi News home page

మరో చరిత్రకు సిద్ధమైన గాంధీ ఆసుపత్రి

May 11 2020 3:41 PM | Updated on May 11 2020 4:14 PM

Gandhi Hospital Turns To Plasma Trials Against Covid-19 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్-19 ఆసుపత్రి గాంధీ ఇప్పుడు మరో చరిత్రకు సిద్ధమైంది. కరోనా వైద్యం కోసమే ప్రత్యేకంగా కేటాయించిన గాంధీ ఆసుపత్రిలో నేటి నుంచి కరోనా మహమ్మారికి చికిత్సలో కీలకంగా భావిస్తున్న ప్లాస్మా థెరపీని మొదలుపెట్టనున్నారు. ఇందుకోసం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) అనుమతి పొందింది. కరోనా బారిన పడి వైద్యసేవల అనంతరం పూర్తి స్థాయిలో కోలుకున్న 35 మంది ప్లాస్మా దాతలు ముందుకురాగా, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న 15మంది నుంచి ప్లాస్మా కణాలను సేకరించారు. వారిలో ఆరుగురు కరోనా బాధితుల కేస్‌ సీట్లు ఇతర వివరాలను ఐసీఎంఆర్‌కు పంపించారు. అక్కడి నుంచి వచ్చిన సూచనల మేరకు మొదటి విడతగా ముగ్గురికి ప్లాస్మా థెరపీ చికిత్స ప్రారంభిస్తారు.
చదవండి: చైనాకు దెబ్బ : ఇండియాకే ప్రాధాన్యం 

ఆరోగ్యవంతుడైన కరోనా బాధితుల నుంచి 400 ఎం.ఎల్‌ ప్లాస్మాను సేకరించి 200 ఎం.ఎల్‌ ప్లాస్మాను బ్లడ్‌ గ్రూప్‌ ఆధారంగా రోగి శరీరంలోకి ఎక్కిస్తారు. ఈ ప్రక్రియకు సుమారు 2 గంటల సమయం పడుతుంది. ప్లాస్మా థెరపీతో రోగి కోలుకుంటున్నట్లు భావిస్తే మరో 200 ఎం.ఎల్‌ ప్లాస్మాను ఎక్కిస్తారు. ఇటు దేశవ్యాప్తంగా పలు ఆస్పత్రుల్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన ప్లాస్మా థెరపీ చికిత్సలు, పనితీరుపై ఐసీఎంఆర్‌ ఎప్పటికప్పుడు ఆరా తీసి పలు సలహాలు సూచనలు అందిస్తోంది. గాంధీలో చేపట్టే ప్లాస్మా థెరపీ చికిత్సను అనుక్షణం ఐసీఎంఆర్‌ నిపుణులు పర్యవేక్షించనున్నారు.

చదవండి: కరోనా క్యాబ్‌లు వచ్చేశాయ్‌! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement