గాంధీ ఆస్పత్రిలో అరుదైన ప్రసవం

Gandhi Hospital Doctors Performed Delivery To Swine Flu Woman - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి వైద్యులు అరుదైన ప్రసవం చేశారు. స్వైన్‌ఫ్లూతో బాధపడుతున్న ఓ మహిళకు డెలివరీ చేశారు. వెంటిలేటర్‌పై ఉన్న సదురు మహిళకు స్వైన్‌ఫ్లూ వార్డులోనే చికిత్స అందించారు. తర్వాత కొద్ది రోజులకు తల్లి, బిడ్డను ఆస్పత్రి నుంచి క్షేమంగా డిశ్చార్జ్‌ చేశారు. స్వైన్‌ఫ్లూతో బాధపడుతున్న తన కూతురికి చికిత్స చేయడానికి కార్పొరేట్‌ వైద్యులు 25 లక్షల రూపాయలు అడిగారని.. అయినా గ్యారంటీ లేదన్నారని ఆ మహిళ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ బిడ్డను బతికించిన గాంధీ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top