నైట్‌ ట్రైన్స్‌లో ఎస్కార్ట్‌ పెంచాలి: జీఎం 

Gajanan Malya ordered the officers on Safety of passengers on trains running at night - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాత్రి పూట నడిచే రైళ్లలో ప్రయాణికుల భద్రత కోసం ఎస్కార్ట్‌ సిబ్బందిని పెంచాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్యా అధికారులను ఆదేశించారు. సోమవారం రైల్‌ నిలయం లో డివిజినల్‌ రైల్వే మేనేజర్లు, ఉన్న తాధికారులతో ప్రయాణికుల భద్రతపై సమీక్షించారు. ఇటీవల బెంగళూరు–గుంతకల్‌ సెక్షన్‌లో జరిగిన దొంగతనాలను దృష్టిలో ఉంచు కుని సూచనలు చేశారు.

ఈ మార్గంలో రాత్రిపూట నడిచే అన్ని రైళ్లలో భద్రతను పెంచాలని చెప్పారు. రైళ్లు సకాలంలో రాకపోకలు సాగిం చేలా శ్రద్ధ తీసుకోవాలని, సిగ్నల్‌ వైఫల్యాలు, లోకో వైఫల్యాలు లేకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సమావేశంలో అదనపు జీఎం బీబీ సింగ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top