సునీల్‌ మృతికి మంత్రి జగదీశ్‌రెడ్డి సంతాపం | G Jagadishwar Reddy Visited V-Six Reporter Sunil Dead Body | Sakshi
Sakshi News home page

సునీల్‌ మృతికి మంత్రి జగదీశ్‌రెడ్డి సంతాపం

Mar 16 2019 1:10 PM | Updated on Apr 3 2019 7:53 PM

G Jagadishwar Reddy Visited V-Six Reporter Sunil Dead Body - Sakshi

నివాళులర్పిస్తున్న విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి

సాక్షి, సూర్యాపేటరూరల్‌ : ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వీ6 రిపోర్టర్‌ సునీల్‌ భౌతికకాయాన్ని శుక్రవారం మండలంలోని యర్కారం గ్రామంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. నివాళులర్పించిన వారిలో ఎంపీ బడుగుల లింగయ్యయా దవ్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ మందుల సామేలు, సూర్యాపేట ఎంపీపీ వట్టె జానయ్యయాదవ్‌తో పాటు పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నారు. 

సునీల్‌ మృతి చెందడం బాధాకరం.. 
రోడ్డు ప్రమాదంలో కోదాడ వీ6 రిపోర్టర్‌ సునీల్‌ మృతి చెందడం బాధకరమని తెంజు రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్‌ ఇస్మాయిల్‌ అన్నారు. శుక్రవారం సూర్యాపేట మండలం యర్కారం గ్రామంలో నిర్వహించిన సునీల్‌ అంతిమయాత్రలో సంఘం జిల్లా అధ్యక్షుడు వజ్జె వీరయ్యతో కలిసి ఆయన పాల్గొన్నారు. సునీల్‌ భౌతికకాయంపై పుష్ఫగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ సహకారంతో సునీల్‌ కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే నేతలు ఎండీ.రియాజుద్దీన్, కారింగుల్‌ అంజన్‌గౌడ్, గోలి విజయ్, గుండేలి శ్రీధర్, శ్రీను, రఘు పాల్గొని సంతాపం తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement