మహిళలను మోసం చేసిన కేసులో అరెస్ట్ | fraudsters arrested in khammam district | Sakshi
Sakshi News home page

మహిళలను మోసం చేసిన కేసులో అరెస్ట్

Jun 7 2016 1:37 PM | Updated on Sep 29 2018 6:06 PM

డ్వాక్రా మహిళలను మోసం చేసిన కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.

ఖమ్మం : డ్వాక్రా మహిళలను మోసం చేసిన కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఖమ్మం జిల్లా రఘనాథపాలెం మండలం బీబీపాలెం గ్రామానికి చెందిన డ్వాక్రా మహిళలను మోసం చేసి సుమారు రూ. కోటి 80 లక్షల నగదును ఆగంతకులు అపహరించుకుని పోయారు. దీంతో సదరు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆక్రమంలో మంగళవారం నిందితులను బీబీపాలెం గ్రామంలో అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ సురేష్ కుమార్, సీఐ శ్రీధర్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ నగదు దొంగతనం ఆరునెలల క్రితం చోటు చేసుకుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement