అప్పుల బాధతో రైతు ఆత్మహత్యాయత్నం | former suicide attempt due to financial problems | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో రైతు ఆత్మహత్యాయత్నం

Jun 24 2015 12:10 PM | Updated on Sep 3 2017 4:18 AM

అప్పుల బాధతో ఓ రైతు ఆత్మయత్నానికి పాల్పడ్డ సంఘటన నల్గొండ మండలం దండెంపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.

నల్గొండ: అప్పుల బాధతో ఓ రైతు ఆత్మయత్నానికి పాల్పడ్డ సంఘటన నల్గొండ మండలం దండెంపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సాంబయ్య తనకున్న నాలుగెకరాల పొలంలో అప్పుచేసి సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో అప్పుల వాళ్ల వత్తిడి ఎక్కువవడంతో పాటు.. బుధవారం ఉదయం అప్పుల వాళ్లు సాంబయ్య ఇంటికి తాళం వేశారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన అతను పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

Advertisement
 
Advertisement
Advertisement