ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం | Formation of Day the BJP's celebrated | Sakshi
Sakshi News home page

ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం

Apr 7 2016 1:52 AM | Updated on Mar 29 2019 5:57 PM

ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం - Sakshi

ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం

భారతీయ జనతా పార్టీ ఆవి ర్భావ దినోత్సవాన్ని బుధవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్‌లో ఘనంగా...

ఆదిలాబాద్ రిమ్స్ : భారతీయ జనతా పార్టీ ఆవి ర్భావ దినోత్సవాన్ని బుధవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్‌లో ఘనంగా నిర్వహించారు. పార్టీ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ పార్టీ జెం డాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజమైన దేశభక్తి ఉన్న పార్టీ ఒక్క బీజేపీయేనని పేర్కొన్నారు.

సామాన్య కార్యకర్త సైతం ప్రధాని పదవీ చేపట్టేందుకు తమ పార్టీలో అవకాశం ఉంటుందన్నారు. యువత బీజేపీలో చేరి భారతమాతకు సేవా చేసే అవకాశాన్ని దక్కించుకోవాలన్నారు. 2019లో అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు మడావి రాజు, సురేష్‌జోషి, జోగు రవి, వేణుగోపాల్, విజయ్‌సింగ్‌షేకావత్, రాము, ప్రవీణ్, సంతోష్‌లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement