వివేకానందుడి స్ఫూర్తితో ముందుకు సాగాలి | follow the spirit of Vivekananda | Sakshi
Sakshi News home page

వివేకానందుడి స్ఫూర్తితో ముందుకు సాగాలి

Jan 24 2018 5:43 PM | Updated on Apr 3 2019 8:28 PM

follow the spirit of Vivekananda - Sakshi

ఏసీపీని సన్మానిస్తున్న ప్రెస్‌క్లబ్‌ సభ్యులు

కాసిపేట : విద్యార్థులు, యువత వివేకానందుడి స్ఫూర్తితో ముందుకు సాగాలని ఏసీపీ బాలుజాదవ్‌ సూచించారు. వివేకానందుడి జయంతోత్సవాల్లో భాగంగా స్థానిక జెడ్పీహెచ్‌ఎస్‌లో మంగళవారం ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఏసీపీ మాట్లాడుతూ వివేకానందుడి భావాలు ప్రతి ఒక్కరికీ ఆలోచనలు కలిగేలా ఉంటాయన్నారు. పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు నిత్యం పర్యవేక్షించాలన్నారు. అంతకు ముందు వివేకానందుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ వంశీధర్‌రావు, జెడ్పీటీసీ సభ్యుడు రౌతు సత్తయ్య, ఎంపీడీవో అబ్ధుల్‌ హై, డీటీడీవో గంగారాం, ఎంఈవో దామోదర్, సూపరింటెండెంట్‌ విజయ్‌కుమార్, పీడీ రవి, ప్రెస్‌క్లబ్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement