చార్‌ధామ్ యాత్రికుల తరలింపునకు ఏర్పాట్లు | Flood-hit Uttarakhand, Gujarat step up rescue operations | Sakshi
Sakshi News home page

చార్‌ధామ్ యాత్రికుల తరలింపునకు ఏర్పాట్లు

Jun 28 2015 2:32 AM | Updated on Sep 3 2017 4:28 AM

చార్‌ధామ్ యాత్రకు వెళ్లి భారీ వర్షాల్లో చిక్కుకున్న రాష్ట్రానికి చెందిన యాత్రికులను సురక్షితంగా ఇళ్లకు చేర్చేందుకు...

ఉత్తరాఖండ్ అధికారులతో ప్రభుత్వం సంప్రదింపులు
సాక్షి, హైదరాబాద్: చార్‌ధామ్ యాత్రకు వెళ్లి  భారీ వర్షాల్లో చిక్కుకున్న రాష్ట్రానికి చెందిన యాత్రికులను సురక్షితంగా ఇళ్లకు చేర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ అనిల్ కుమార్ సింఘల్, అడిషనల్ ఆర్సీ అర్జా శ్రీకాంత్‌లు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ ఉత్తరాఖండ్ ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు చేస్తున్నట్టు అధికారవర్గాలు వెల్లడించాయి.

ఏపీ భవన్ ఓఎస్డీ ఎం.అశోక్‌బాబు (9871999051), ఏపీ పర్యాటక సహాయ సంచాలకులు జి.రామకోటయ్య (9810981293) హరిద్వార్. గోవర్ధన్‌నాయుడు (8171503333) జోషిమఠ్ వద్ద అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. యాత్రికులకు వసతి ఏర్పాట్లు చేయాలని రిషికేశ్‌లోని టీటీడీ ఆశ్రమ ఇన్‌ఛార్జిలు ఓంకార్, జనార్దన్‌లకు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement