breaking news
Chardham trip
-
హిమాలయాల ఒడిలో సాగే చార్ధామ్ యాత్ర!
హిమాలయ శిఖరాల నుంచి జారే మంచు బిందువులను చూస్తూ గంటానాదాల మధ్య పరవశించి పోయే దివ్యక్షేత్రాల ప్రయాణమే ఉత్తరాఖండ్ గర్వాల్ పర్వతాల మధ్య సాగే చార్ ధామ్ యాత్ర. యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బదిరీనాథ్.. ఈ నాలుగు క్షేత్రాలను కలుపుతూ చేసే యాత్ర చార్ధామ్.ప్రతి మనిషి తన జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించాలి అనుకునే ఈ నాలుగు పవిత్ర స్థలాల దర్శనం కేవలం తీర్థయాత్ర మాత్రమే కాదు. అది ఒక ఆధ్యాత్మిక సంచారం. ప్రశాంతంగా సాగే ఈ యాత్ర మనసులోని అలజడి మొత్తాన్ని దూరం చేసి కొత్త ప్రశాంతతను చోటు ఇస్తుంది.చల్లని గాలులు మేనిని తాకుతుండగా, మబ్బుల మధ్య నుంచి కనిపించే పర్వతాల అందాలు చూస్తుంటే ప్రకృతి తన సహజ అందాలను చూపుతున్నట్టుగా ఉంటుంది.హిమాలయాల ఒడిలో సాగే చార్ధామ్ యాత్ర ఆధునిక ప్రపంచ అలజడి నుంచి దూరంగా తీసుకెళ్లిపోతుంది. మొదటి ఘట్టం యమునోత్రి దగ్గర మట్టి వాసనలతో మొదలై మనసుకు హాయిని ఇస్తుంది. తరువాత గంగోత్రి క్షేత్రానికి వెళ్లే దారి ΄÷డవునా ఉన్న చెట్ల వరుసలు, భగీరథి నది జోరుగా సాగే ప్రవాహం చూస్తుంటే ప్రకృతి తన అసలు స్వరూపాన్ని చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది.కేదార్నాథ్ చేరగానే చుట్టూ ఉన్న మంచు పర్వతాల మధ్య గుడి గోపురం వెనుక కనిపించే శిఖరాలు భక్తి భావంతో పాటు మనసుకు ప్రశాంతతను కలిగిస్తాయి. చివరగా అలకనంద నది ఒడ్డున ఉన్న బద్రినాథ్ క్షేత్రాన్ని చూస్తుంటే యాత్రకు ఒక పరిపూర్ణత వచ్చినట్టుగా అనిపిస్తుంది. క్షేత్రాల చుట్టూ ఉండే చిన్న చిన్న గ్రామాలు, పర్వతాల అందాలు ఈ ఆధ్యాత్మిక యాత్రకు మరింత ప్రత్యేకతను తీసుకొస్తాయి.చేయాల్సిన పనులు..జానకి చట్టి నుంచి యమునోత్రి వరకు ట్రెక్కింగ్ చేస్తూ ప్రకృతితో చేసే మౌన సంభాషణను ఆస్వాదించవచ్చు.గంగోత్రిలో భగీరథి నది నీటిని స్పర్శించి ఆ పవిత్రతను అనుభవించవచ్చు.గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్ వరకు సాగే ప్రయాణంలో తోటి యాత్రికుల భక్తి స్వరాలు వింటూ ట్రెక్కింగ్ లేదా గుర్రంపై ప్రయాణించవచ్చు.బద్రినాథ్ దర్శనం తరువాత తప్త కుండ్‌లో స్నానం చేసి ఆ వేడి నీటి హాయినీ ఆస్వాదించవచ్చు.మానా గ్రామంలో తిరుగుతూ అక్కడి స్థానిక స్థల పురాణాలను తెలుసుకోవచ్చు.ఆసక్తికరమైన విషయాలు..ట్రెడిషన్ ప్రకారం చార్ ధామ్ యాత్ర యమునోత్రి నుంచి ప్రారంభమై గంగోత్రి, కేదార్నాథ్, బద్రినాథ్‌తో ముగుస్తుంది.ఈ యాత్ర ప్రతి సంవత్సరం ఏప్రిల్ లేదా మే నుంచి అక్టోబర్ వరకు ఓపెన్ ఉంటుంది.కేదార్నాథ్ చేరడానికి గౌరీకుండ్ నుంచి సుమారు 16 కిలోమీటర్ల ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది.మానా గ్రామం భారతదేశంలోని చివరి గ్రామంగా ప్రసిద్ధి చెందింది.యాత్రకు ముందు ఉత్తరాఖండ్ పోర్టల్‌లో అధికారికంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి.ఎక్కడ ఉండాలి?యాత్ర సాగే ప్రతి చోట హోటల్స్, ధర్మశాలల వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. గర్వాల్ మండల్ వికాస్ నిగమ్ గెస్ట్ హౌస్‌లు కానీ, కొండ అంచున ఉన్న చిన్న కాటేజీలు కానీ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. హడావిడి లేని వాతావరణం, ఎటు చూసినా కనిపించే పర్వతాల దృశ్యాలు, ఉదయాన్నే వీచే చల్లని గాలిని ఆస్వాదిస్తూ పర్వతాల మధ్య కూర్చోవడం ఒక మరిచిపోలేని అనుభూతిగా మిగిలిపోతుంది. పెద్ద పెద్ద విలాసాలు లేకపోయినా ఇక్కడ ప్రతి లాడ్జిలో దొరికే అతిథ్యం, చుట్టూ ఉన్న ప్రకృతి మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. కొండ గాలిలో కలిసిన ఆ మౌనాన్ని ఆస్వాదించడం చార్ ధామ్ యాత్ర ప్రత్యేకత.ఏం చూడాలి?పర్వతాల వెనుక నుంచి మెల్లిగా ఉదయించే సూర్యుడు, సాయంత్రం వేళ నదుల దగ్గర జరిగే హారతి దృశ్యాలు తప్పకుండా చూడాలి. కేదార్నాథ్ దగ్గర మందాకిని నది ప్రవాహం మధ్య నిలబడితే ప్రకృతితో కలిసి ఒక పాట పాడుతున్నట్టుగా అనిపిస్తుంది. బద్రినాథ్‌లోని తప్త్ కుండ్‌లో వేడి నీటి స్నానం శరీరానికి మాత్రమే కాదు, మనసుకు కూడా హాయిని ఇస్తుంది.భారతదేశంలోని చివరి గ్రామంగా పిలువబడే మానా గ్రామంలో నడుస్తుంటే ఒక కొత్త ప్రపంచంలో తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. గంగా, యమునా నదుల ఉద్భవ స్థలాలను చూస్తుంటే మనసులోని ఆలోచనలు కూడా ప్రశాంతంగా మారిపోతాయి. రాత్రివేళ మంచు కప్పిన పర్వతాల మధ్య చుక్కలతో నిండిన ఆకాశం అద్భుతమైన విజువల్ ట్రీట్‌లా కనిపిస్తుంది.ఎలా వెళ్లాలి?ఈ పవిత్ర యాత్రను హైదరాబాద్ నుంచి ప్రారంభించాలంటే ముందుగా దెహ్రాడూన్ లేదా ఢిల్లీకి ఫ్లైట్ లేదా ట్రైన్ ద్వారా చేరుకుని అక్కడి నుంచి హరిద్వార్ వైపు ప్రయాణం సాగించాలి. విజయవాడ నుంచి వచ్చిన వారికి కూడా ఢిల్లీ కనెక్టివిటీ సులభంగా లభిస్తుంది.హరిద్వార్ నుంచి పర్వత దారుల్లో బస్ లేదా ట్యాక్సీలో సాగే ప్రయాణంలో ఒకవైపు లోయలు, మరోవైపు ఆకాశాన్ని తాకే కొండలు కనిపిస్తాయి. కొండలపై మబ్బుల తెరలు దాటుకుంటూ, చల్లని గాలుల స్పర్శను ఆస్వాదిస్తూ సాగే ఈ ప్రయాణం జీవితాంతం గుర్తుండిపోతుంది.ఏం తినాలి?ఈ కొండప్రాంతాల్లో దొరికే వేడి వేడి ఆలూ పరాటా, పహాడి దాల్ చావల్‌తో పాటు గరం చాయ్ ప్రయాణంలో మరో అందమైన భాగంగా అనిపిస్తాయి. లోకల్‌గా తయారు చేసే జొన్న రొట్టెతో పాటు పహాడి కర్రీ రుచి మరిచిపోలేనిదిగా ఉంటుంది. ప్రతి గుడి దగ్గర దొరికే ప్రసాదంలో ప్రత్యేకమైన రుచిని ఆస్వాదించవచ్చు. చల్లని వాతావరణంలో వేడి వేడి జిలేబీ తినడం, స్వచ్ఛమైన కొండ నీటితో తయారైన వంటలను ఆస్వాదించడం ఈ యాత్రను మరింత మధురంగా మారుస్తాయి.యాత్ర బడ్జెట్ వివరాలు..చార్ధామ్ యాత్ర మొత్తంగా పూర్తి చేయడానికి సాధారణంగా 10 నుంచి 12 రోజుల సమయం పడుతుంది. హైదరాబాద్ నుంచి దెహ్రాడూన్ వరకు ఫ్లైట్ లేదా ట్రైన్ ద్వారా చేరుకోవచ్చు.స్టాండర్డ్ గ్రూప్ ప్యాకేజీల ప్రకారం ఒక్కరికి సుమారు రూ.25 వేల నుంచి రూ.45 వేల మధ్య బడ్జెట్ అయ్యే అవకాశం ఉంది. ప్రైవేట్ క్యాబ్ లేదా ప్రీమియం ప్యాకేజీలు తీసుకుంటే ఈ ఖర్చు రూ.55 వేల నుంచి రూ.75 వేల వరకు పెరగవచ్చు.స్టే కోసం ప్రతి రాత్రి రూ.1000 నుంచి రూ.3500 మధ్య మంచి రూమ్స్ లభిస్తాయి. ఫుడ్ కోసం ప్రతి రోజు రూ.400 నుంచి రూ.600 మధ్య వెజిటేరియన్ ఫుడ్ లభిస్తుంది.హెలికాప్టర్ సర్వీస్ ఉపయోగించాలనుకుంటే ముందుగానే బుకింగ్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే సీజన్ సమయంలో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. – ఎం.జి. కిశోర్, ప్రయాణికుడుగమనిక : ఇక్కడ ఇచ్చిన ట్రావెల్, బడ్జెట్ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. ప్రయాణానికి ముందు తాజా అప్డేట్స్ వెరిఫై చేసుకుని యాత్రను ప్లాన్ చేసుకోవడం మంచిది. -
Uttarakhand: చార్ధామ్ యాత్ర నిలిపివేత
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఏకధాటిగా వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రంలోని నదులన్నీ పోటెత్తి ప్రవహిస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో చార్ధామ్ యాత్రను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వర్షాల కారణంగా చమోలీ జిల్లాలతోని బద్రీనాథ్ నేషనల్ హైవేపై పలుచోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. ఫలితంగా వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. శనివారం కొండచరియలు విరిగి పడిన ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. భారత వాతావరణశాఖ(ఐఎండీ) ఉత్తరాఖండ్‌కు రెడ్అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో రానున్న రోజుల్లో మరిన్ని భారీ వర్షాలు కురిసే ఛాన్సుందని తెలిపింది. రెడ్ అలర్ట్ నేపథ్యంలో సీఎం పుష్కర్‌సింగ్ ధామి కలెక్టర్లను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. -
చార్ధామ్ యాత్ర
జీవిత కాలంలో ఒక్కసారైనా వెళ్లితీరాలని కోరుకునే యాత్ర. వెళ్లే మార్గం సంక్లిష్టమైనదైనా ప్రకృతి సోయగాలలో ప్రశాంతతను పొందాలని ఆకాక్షించే యాత్ర. హిమాలయ పర్వత శ్రేణులలో వెలసిన ఆరాధ్య దైవాలను దర్శించి, తరించాలని తపించే యాత్ర. అదే, అతిపవిత్రమైన చార్ ధామ్ యాత్ర. గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్,కేదార్నాథ్ ఈ నాలుగు పుణ్యక్షేత్రాలను ఒక్కసారి సందర్శించుకొని రావటాన్ని ‘చార్ధామ్ యాత్ర’ అంటారు. సంవత్సరంలో ఆరు నెలల పాటు దేవత లు పూజిస్తారని పేరొందిన ఈ నాలుగు ఆలయాలను మిగిలిన 6 నెలల కాలంలో మానవులు సందర్శించుకోవచ్చు. ఎంతో మహిమాన్వితమైన ఈ ఆలయాల ద్వారాలు ప్రతి సంవత్సరం మే మొదటి వారంలో తెరుస్తారు. తిరిగి నవంబర్‌లో వచ్చే దీపావళి పర్వదినం తర్వాత మూసివేస్తారు. ఈ ఏడాది మే 8 నుంచి చార్ధామ్ యాత్ర ప్రారంభమవుతుంది. నాలుగు ఆలయాలూ ఉత్తరాఖండ్‌లోనే... గంగానది, యమునా నది జన్మస్థలాలను గంగోత్రి, యుమునోత్రి అంటారు. అలాగే బద్రీనాథ్‌లో శ్రీ మహావిష్ణువు, కేదార్‌నాథ్‌లో శివుడు స్వయంభువుగా వెలిసినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఈ నాలుగు దేవాలయాలు భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నాయి. యమునోత్రి మొదటి దర్శనం చార్ధామ్ యాత్రలో మొదటగా దర్శించుకునే ధామం (క్షేత్రం) యమునోత్రి. యమునానది జన్మస్థలంలోనే యమునాదేవి ఆలయం ఉంది. యమునానది ప్రాశస్త్యం గురించి ఒక్కో పురాణం ఒక్కో కథను వివరిస్తున్నాయి. ప్రముఖంగా చెప్పుకునేది - సూర్యదేవుడు ఆయన అర్ధాంగి ఛాయాదేవికి యముడు, యమున ఇద్దరు సంతానం. ఛాయాదేవికి కూతురైన యమున మీద ఆగ్రహం కలిగి భూలోకంలో పడి ఉండమని శపించిందట. దాంతో యమున భూలోకంలో నదిగా అవతరించిందట. గంగోత్రి గంగ మొదటగా నేలమీదికి దూకింది ఇక్కడే! చార్ధామ్ యాత్రలో సులువుగా చేరుకోగలిగే ప్రాంతం గంగోత్రి. ఈ నది జన్మస్థలం ఉత్తరాఖండ్ రాష్ర్టంలోని ఉత్సర కాశీ జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం. సముద్రమట్టానికి 3,750 మీటర్ల ఎత్తులో హిమాలయ పర్వత శ్రేణులలో ఉంది. నదులన్నింటిలో గంగానది పరమపవిత్రమైనదిగా పూజలందుకుంటోంది. భగీరథుడి తపఃఫలంగా ఉద్భవించిన గంగ 18 కిలోమీటర్ల దూరం ప్రయాణించి గోముఖం అనే చోట నేల మీదకు దూకుతుంది. గంగ మొదటగా నేల మీదకు దిగింది ఈ చోటనే! గోముఖం నుండి గంగోత్రి చేరే వరకు ఈ ప్రవాహంలోని నీటికి ఎక్కడా మానవ స్పర్శ అంటదు. అందువల్ల రామేశ్వరంలోని రామలింగేశ్వర స్వామికి చేసే నిత్యాభిషేకం ఈ గంగోత్రి నీటితోనే చేస్తారు. స్నానఘట్టాలకు పైన అంటే నది ఒడ్డున ఉన్న ప్రధాన వీధికి చివరగా గంగామాత పవిత్ర ఆలయం ఉంది. కేదార్నాథ్ నరనారాయణులు తపస్సు చేసిన స్థలం అత్యున్నతమైన ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిది కేదార్నాథ్. అతి గొప్ప పుణ్యక్షేత్రం. ఇది వైశాఖమాంలో అంటే ఏప్రిల్ ఆఖరి వారంలో గాని, మే నెల మొదటి వారంలో గానీ తెరుస్తారు. తిరిగి అక్టోబరు నెల ఆఖరు వారంలో లేదా నవంబరు నెల మొదటి వారంలో మూసివేస్తారు. మందాకినీ నది ఒడ్డున వెలసిన ఈ కేదార్నాథ్ ఆలయం ప్రాంగణంలో సజీవాకృతిలో ఉన్న బ్రహ్మాండమైన నంది విగ్రహం ఉంది. నరనారాయణులు కేదారనాథుని అనుమతి తీసుకొని, బదరీనాథ్‌లో తపస్సు చేశార ని స్థలపురాణం చెబుతోంది. బద్రీనాథ్ బ్రహ్మకపాలం ఉన్నదే బద్రీనాథ్ జగద్గురు ఆదిశంకరుల వారు నెలకొల్పిన ఈ క్షేత్రంలో అన్ని తీర్థాలూ సమస్త దేవతలూ నివసిస్తారనీ నమ్మకం. ఈ ఆలయంలో వైశాఖం నుండి కార్తీక మాసం వరకు మానవులు, మార్గశిరం నుండి చైత్రమాసం చివరి వరకు నారద మహర్షి స్వామికి పూజలు చేస్తారని కథనాలు. గర్భాలయంలో ఉత్సవమూర్తితో పాటు స్వామి ఎడమవైపు నరనారాయణులు, శ్రీదేవి, భూదేవి, నారదుడు, ఉద్ధవుడు, స్వామి పాదుకలు ఉండగా, కుడివైపున కుబేరుడు, గరుత్మంతుడు కొలువుదీరి ఉన్నారు. తప్తకుండం సమీపంలో ఉన్న నల్లటి శిలను బ్రహ్మకపాలం అంటారు. ఒకప్పుడు బ్రహ్మదేవుడు అత్యంత సుందరమైన స్త్రీని సృష్టించి, ఆమె అందానికి మోహితుడయ్యాడట. ఆగ్రహించిన శివుడు బ్రహ్మ శిరస్సును ఖండించగా ఆ శిరస్సు శివుని చేతికి అంటుకుపోయిందట. ఎక్కడా వదలని ఆ శిరస్సు బదరికాశ్రమం చేరగానే ఊడిపోయిందట. అలా, ఇక్కడ కనిపించే శిలనే బ్రహ్మదేవుని కపాలమని స్థలపురాణం చెబుతోంది. పితరులకు ఇక్కడ పిండ ప్రదానం చేస్తే మోక్షప్రాప్తి సిద్ధిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. చార్ధామ్ యాత్రలో ఆర్.వి.టూర్స్ - ట్రావెల్స్ ఎన్నో సంవత్సరాలుగా ఆధ్యాత్మిక యాత్రా ప్రపంచంలో అగ్రగామిగా ఉంది ఆర్.వి.టూర్స్ - ట్రావెల్స్ సంస్థ. ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా చార్ధామ్ యాత్ర ఏర్పాటు చేస్తూ యాత్రికుల మన్ననలను పొందుతోంది. హిమాలయ మంచుకొండల్లో సైతం తెలుగువారి భోజన సదుపాయాలతో పాటు వసతి సౌకర్యాలను, యాత్రీకులకు తోడుగా గైడ్స్‌ని ఏర్పాటు చేసి, కుటుంబ సభ్యులు వెంటలేరన్న లోటును తీరుస్తోంది. అందరికీ అందుబాటులో: ‘‘ఈ ఏడాది (2016) చార్ధామ్ యాత్రకు సంబంధించి 14 రోజుల వ్యవధిలో హైదరాబాద్ నుండి ప్రారంభమై తిరిగి హైదరాబాద్‌కు వచ్చేవరకు యాత్రికుల వసతి సౌకర్యాలను చాలా తక్కువ ధరలకే ఏర్పాటు చేశామ’’ని ఆర్.వి.సంస్థ అధినేత ఆర్.వి.రమణ తెలియజేస్తున్నారు. వచ్చే నెల మే 5, 12, 19 - జూన్ 2 తేదీలలో ఆర్.వి.ట్రావెల్స్ వారు ప్రత్యేకంగా చార్ధామ్ గ్రూపు ప్యాకేజీలు ఏర్పాటుచేశారు. ‘ఆర్.వి,ట్రావెల్స్ సంస్థ ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని కూడా చార్ధామ్ భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసినట్లు ఆర్.వి.రమణ తెలియజేశారు. ఆసక్తి కలిగిన వారు వెంటనే సంప్రదించి తమ యాత్రను ఏర్పాటు చేసుకోవలసిందిగా కోరుతున్నారు. వివరాలకు... చాలా హ్యాపీగా అనిపించింది నేనో కార్పోరేట్ ఇంజనీర్ని. కుటుంబసభ్యులతో కలిసి చార్ధామ్ యాత్రకు వెళ్లాను. ఏ తీర్థయాత్రకు వెళ్లినా ఫుడ్ పెద్ద సమస్యగా ఉంటుంది. కానీ, ఆర్.వి.ట్రావెల్స్‌లో ఫుడ్ మా ముందే ప్రిపేర్ చేసి పెట్టారు. అంతదూరం తీసుకెళ్లి ఆంధ్రాఫుడ్ పెట్టమంటే మామూలు విషయం కాదు. గెడైన్స్ బాగా ఇచ్చారు. మళ్లీ అదే ట్రావెల్స్ నుంచి జూన్‌లో అమర్నాథ్కు వెళ్లడానికి సిద్ధమవుతున్నాను. వ్యక్తిగత షాపింగ్‌కు తప్ప మరే ఖర్చు లేదు. చాలా హ్యాపీగా అనిపించింది. - విద్యాధర్, గుంటూరు 9553633733 ఎన్నో జన్మల పుణ్యఫలం కిందటేడాది నేనూ నా భార్యా చార్ధామ్ యాత్రకు వెళ్లొచ్చాం. ఈ యాత్ర ఎన్నో జన్మల పుణ్యఫలంగా మాత్రమే లభిస్తుందని మాకు తెలిసొచ్చింది. ఆర్.వి.ట్రావెల్స్ అందించిన సదుపాయాల వల్ల యాత్రలో ఎక్కడా ఇబ్బంది అనిపించలేదు. - మోహన్‌రెడ్డి, హైదరాబాద్ 9515034951 సునాయాసంగా చేరుకోగలిగాం చార్ధామ్ కష్టతరమైన యాత్ర. కానీ, ఇప్పటికి మూడు సార్లు వెళ్లొచ్చాను. కిందటి సారి మా ఫ్యామిలీ, మా ఫ్రెండ్ ఫ్యామిలీ కలిసి బయల్దేరాం. గంగోత్రి, యమునోత్రి, బదిరానాధ్ రోడ్డు మార్గాలు చాలా క్లిష్టంగా ఉంటాయి. కానీ, అర్.వి. ట్రావెల్స్ వారి గైడ్‌లైన్స్‌తో సునాయాసంగా ఈ ప్రాంతాలకు చేరుకోగలిగాం. భోజన, వసతి సదుపాయాలు చాలా బాగున్నాయి. - ఎమ్. సత్తిరెడ్డి, దిల్సుఖ్నగర్, హైదరాబాద్ 8978253399 ఇబ్బందులు ఎదురుకాలేదు జీవితంలో తప్పనిసరిగా చూడాల్సిన యాత్ర చార్ధామ్. నేను, మా వారు ఈ యాత్రకు వెళ్ళొచ్చాం. దేనికదీ చాలా ప్రత్యేకంగా అనిపించింది. ట్రావెల్స్ వారు ఏర్పాటు చేసిన భోజన, వసతి సౌకర్యాలు పరిశుభ్రంగా, రుచిగా ఉండటంతోబాటు పద్ధతి ప్రకారం నడుచుకోవడం వల్ల ఎక్కడా ఇబ్బందులు రానివ్వలేదు - శ్రీమతి వెంకటరమణ, నర్సారావుపేట 9676393449 -
చార్ధామ్ యాత్రికుల తరలింపునకు ఏర్పాట్లు
ఉత్తరాఖండ్ అధికారులతో ప్రభుత్వం సంప్రదింపులు సాక్షి, హైదరాబాద్: చార్ధామ్ యాత్రకు వెళ్లి భారీ వర్షాల్లో చిక్కుకున్న రాష్ట్రానికి చెందిన యాత్రికులను సురక్షితంగా ఇళ్లకు చేర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ అనిల్ కుమార్ సింఘల్, అడిషనల్ ఆర్సీ అర్జా శ్రీకాంత్‌లు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ ఉత్తరాఖండ్ ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు చేస్తున్నట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. ఏపీ భవన్ ఓఎస్డీ ఎం.అశోక్‌బాబు (9871999051), ఏపీ పర్యాటక సహాయ సంచాలకులు జి.రామకోటయ్య (9810981293) హరిద్వార్. గోవర్ధన్‌నాయుడు (8171503333) జోషిమఠ్ వద్ద అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. యాత్రికులకు వసతి ఏర్పాట్లు చేయాలని రిషికేశ్‌లోని టీటీడీ ఆశ్రమ ఇన్‌ఛార్జిలు ఓంకార్, జనార్దన్‌లకు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.


