డీజిల్ ట్యాంకర్‌లో మంటలు | fire in diesel tanker at secundrabad | Sakshi
Sakshi News home page

డీజిల్ ట్యాంకర్‌లో మంటలు

Jun 12 2015 1:32 PM | Updated on Sep 5 2018 9:45 PM

సికింద్రాబాద్ లో ఓ డీజిల్ ట్యాంకర్ లో షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.

సికింద్రాబాద్: సికింద్రాబాద్ లో ఓ డీజిల్ ట్యాంకర్ లో షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ సంఘటన శుక్రవారం సికింద్రాబాద్‌లోని ఎస్సీ రోడ్డులో జరిగింది. వివరాలు.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు చెందిన డీజిల్ ట్యాంకర్ చర్లపల్లి నుంచి హైటెక్ సిటీకి వెళ్తోంది. ఈ ట్యాంకర్ మార్గ మధ్యలో ఎస్సీ రోడ్డు వద్దకు రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగి ట్యాంకర్‌కు అంటుకున్నాయి. అయితే, సమీపంలోనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసు కార్యాలయాలు ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. కాగా, ఈ ప్రమాదంతో ఎస్సీ రోడ్డులో ముందస్తు చర్యగా వాహనాల రాకపోకలను పోలీసులు నియంత్రించారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement