ప్యారడైజ్ హోటల్‌లో అగ్నిప్రమాదం | fire accident in paradise hotel at paradise hotel | Sakshi
Sakshi News home page

ప్యారడైజ్ హోటల్‌లో అగ్నిప్రమాదం

Jun 8 2014 1:22 PM | Updated on Sep 2 2017 8:30 AM

ప్యారడైజ్ హోటల్‌లో అగ్నిప్రమాదం

ప్యారడైజ్ హోటల్‌లో అగ్నిప్రమాదం

కాచిగూడలోని సిలిండర్ గోడౌన్ లో అగ్నిప్రమాదం జరగక ముందే సికింద్రాబాద్ లోని ప్యారడైజ్ హోటల్‌లో అగ్నిప్రమాదం సంభవించింది.

సికింద్రాబాద్: కాచిగూడలోని సిలిండర్ గోడౌన్ లో అగ్నిప్రమాదం జరగక ముందే సికింద్రాబాద్ లోని ప్యారడైజ్ హోటల్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. హోటల్లోని వంటగదిలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు.

అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తేవడంతో ముప్పు తప్పింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. కిచెన్‌లో షార్ట్‌సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించినట్టు భావిస్తున్నారు. కాచిగూడలోని సంజయ్‌గాంధీనగర్ బస్తీలో శనివారం రాత్రి  అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రంలో భారీ పేలుడు సంభవించడంతో ఒకరు మృతి చెందగా ఎనిమిది మంది గాయపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement