అగ్నిప్రమాదం: రూ. 20 లక్షల ఆస్తి నష్టం | Fire accident in khammam district | Sakshi
Sakshi News home page

అగ్నిప్రమాదం: రూ. 20 లక్షల ఆస్తి నష్టం

Mar 10 2016 7:18 AM | Updated on Mar 22 2019 7:18 PM

ఖమ్మం జిల్లా ముదిగొండలో ప్లాస్టిక్ పరిశ్రమలో గురువారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి.

ఖమ్మం: ఖమ్మం జిల్లా ముదిగొండలో ప్లాస్టిక్ పరిశ్రమలో గురువారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. భద్రత సిబ్బంది వెంటనే స్పందించి... అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పివేశారు. ఈ ప్రమాదంలో రూ. 20 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించిందని యాజమానులు తెలిపారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణం తెలియరాలేదు. షార్ట్ సర్క్యూటే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement