కెమికల్ డంపింగ్ యార్డులో అగ్నిప్రమాదం | fire accident in chemical dumping yard | Sakshi
Sakshi News home page

కెమికల్ డంపింగ్ యార్డులో అగ్నిప్రమాదం

Nov 23 2015 12:29 PM | Updated on Sep 5 2018 9:45 PM

రసాయన వ్యర్థాల యార్డులో అగ్ని ప్రమాదం సంభవించింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గగన్‌పహాడ్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

శంషాబాద్: రసాయన వ్యర్థాల యార్డులో  భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గగన్‌పహాడ్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని కెమికల్స్ డంపింగ్ యార్డులో సోమవారం ఉదయం అకస్మాత్తుగా మంటలు రేగాయి. భారీగా మంటలు వ్యాపించటంతో చుట్టుపక్కల వారు అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. యార్డు పక్కనే విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఉండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement