సాగునీటికోసం లడాయి

Fighting For Water - Sakshi

కమాలొద్దీన్‌పూర్‌–మహ్మదుసేన్‌పల్లిలో ఉద్రిక్తత

పెద్దవాగు వెంట పరుగులు

చెక్‌డ్యాంపై సంచులు వేసిన కమాలొద్దీన్‌పూర్‌ రైతులు

తొలిగించేందుకు వచ్చిన మహ్మదుస్సేన్‌పల్లి గ్రామస్తులు

పోలీసుల రంగప్రవేశంతో సద్దుమణిగిన వివాదం

ఖిల్లాఘనపురం (వనపర్తి) : కల్వకుర్తి ఎత్తిపోతల ప థకం ప్రధాన కాల్వనుంచి ఖిల్లాఘనపురం బ్రాం చ్‌ కెనాల్‌ ద్వారా వస్తున్న సాగునీరు పలుగ్రామాల రైతుల మధ్య గొడవ పెట్టింది. ఇటీవలే మం డలంలోని పెద్దవాగు ద్వారా కృష్ణాజలాలు వస్తున్నాయి.  ఈ నీరు నేరుగా మహ్మదుస్సేన్‌పల్లి, ని జాలపురం తదితర గ్రామాల వరకు వాగుద్వారా వెళతాయి. అయితే వెంకటాంపల్లి గ్రామ శివా రులో ఉన్న చెక్‌డ్యాంపై కమాలొద్దీన్‌పూర్‌ గ్రామానికి చెందిన కొందరు రైతులు ఇటీవల సంచుల్లో ఇసుక నింపి కట్టగా వేశారు.

ఆ నీటిని గ్రామానికి చెందిన వాతరాయ చెరువుకు పాటు కాల్వ ద్వారా  తరలించారు. ఇది గమనించిన నిజాలాపురం గ్రామానికి చెందిన రైతులు చెక్‌డ్యాంపై ఉన్న సంచులను రెండు రోజుల క్రితం తొలిగించారు. ఇది తెలుసుకున్న కమాలొద్దీన్‌పూర్‌ రైతులు జేసీబీ  సహాయంతో కట్టవేసి చెక్‌డ్యాంపై మళ్లీ సంచులు వేశారు.

మంగళవారం అక్కడికి వచ్చిన మహ్మదుస్సేన్‌పల్లి గ్రామ రైతులు సంచులను తొలిగించడానికి వెళ్లడంతో కమాలొద్ధీన్‌పూర్‌ గ్రామ రైతులు అడ్డుకున్నారు. సంచులు వేస్తేనే మా చెరువుకు నీళ్ళు వెళతాయని సంచులు తీయనీయమని పట్టుబట్టారు. సంచులు తీస్తేనే మా చెరువుకు నీరు వెళతాయని మహ్మదుస్సేన్‌పల్లి గ్రామ రైతులు సంచులు తీసేందుకు యత్నించారు.  

నచ్చజెప్పిన పోలీసులు 

చెక్‌డ్యాం దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో సమాచారం అందుకున్న ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ఇరుగ్రామాల రైతులతో మాట్లాడి కొన్ని సంచులు తీయించారు. అయినా సాయంత్రం వరకు సంచులు తొలిగిస్తామని కమాలొద్దీన్‌పూర్‌ గ్రామ రైతులు, మళ్లీ అడ్డువేస్తారని మహ్మదుస్సేన్‌పల్లి గ్రామ రైతులు చెక్‌డ్యాం దగ్గర కాపలా ఉన్నారు.

ఇదిలాఉంటే మహ్మదుస్సేన్‌పల్లి చెరువుకు వెళ్తున్న నీటిని ముసాపేట మండలం నిజాలాపురం గ్రామానికి చెందిన రైతులు తరలించేందుకు యత్నించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్తితి నెలకొంది. ముసాపేట మండలానికి చెందిన ఎస్‌ఐ, తహసీల్దార్‌ అక్కడకు చేరుకుని రైతులకు నచ్చజెప్పారు. పెద్దవాగు వెంట రైతుల మధ్య ఎప్పుడు ఏం గొడవ చోటుచేసుకుంటుందోనని ఆయాగ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top