బీసీల హక్కుల కోసం పోరాడాలి: ఆర్‌.కృష్ణయ్య | Fight for the rights of BCs | Sakshi
Sakshi News home page

బీసీల హక్కుల కోసం పోరాడాలి: ఆర్‌.కృష్ణయ్య

Jan 29 2018 3:01 AM | Updated on Jan 29 2018 3:01 AM

Fight for the rights of BCs - Sakshi

హైదరాబాద్‌: బీసీలు తమ హక్కుల కోసం నిరంతర పోరాటం చేయాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య అన్నారు. బీసీ టీచర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రాష్ట్ర సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీసీలు గొర్రెలు, బర్రెలు, చేపలకు ఆశపడకుండా రాజ్యాధికారానికై అడుగులు వేయాలని కృష్ణయ్య పిలుపునిచ్చారు.

రాజ్యాధికారం ద్వారానే బీసీలకు ఆత్మగౌరవం దక్కుతుందన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ, బీసీలు ఐక్యంగా ఉంటేనే జాతికి మేలు జరుగుతుందన్నారు. కులవృత్తులను, కులాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాగాయకుడు గద్దర్‌ మాట్లాడుతూ.. బీసీలు రాజకీయ, ఆర్థిక రంగాల్లో రాణించాల్సిన అవసరం ఉందన్నారు. పాలకులపై ఒత్తిడి తెచ్చి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement