రెవెన్యూ డివిజన్‌ సాధనకు పోరాటం | fight for revenue division | Sakshi
Sakshi News home page

రెవెన్యూ డివిజన్‌ సాధనకు పోరాటం

Oct 18 2017 3:17 PM | Updated on Oct 18 2017 3:17 PM

పరకాల: పరకాల రెవెన్యూ డివిజన్‌ సాధన కోసం ఈనెల 18న ఆత్మగౌరవ యాత్ర, 21న బంద్‌కు పిలుపునిస్తున్నట్లు అఖిలపక్షం నాయకులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వాల్‌ పెస్టర్‌ను మంగళవారం అమరధామంలో అఖిలపక్ష నాయకులు  ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ పాత తాలుక మండలాలతో కలిపి రెవెనూ డివిజన్‌ చేయాలని కోరుతున్నా స్థానిక ఎమ్మెల్యే, అధికార పార్టీ నాయకులు పట్టించుకోకుండా పరకాల మండలాన్ని రెండు ముక్కలు చేశారని మండిపడ్డారు.

టెక్స్‌టైల్‌ పార్క్‌ శంఖుస్థాపన చేయడానికి సీఎం కేసీఆర్‌ స్పందించి పరకాలకు న్యాయం చేసేలా బంద్‌లో ప్రజలు, వ్యాపారస్తులు పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు పిట్ట వీరస్వామి, కొలుగూరి రాజేశ్వర్‌రావు, పసుల రమేష్, బొచ్చు కృష్ణారావు, దేవునూరి మేఘనా«థ్, బొచ్చు భాస్కర్, దుప్పటి సాంబయ్య, నక్క చిరంజీవి, ముదిరాజ్‌ సంఘం నాయకులు జంగేటి సారంగఫాణి, బోయిని పోశాలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement