రుణాల కోసం రైతులు పడరాని కష్టాలు పడుతున్నారు. బ్యాంకుల తెరువకముందే బ్యాంకుల ఎదుట బారులు తీరాల్సి వస్తోంది.
రుణమాఫీ పొంది కొ త్త రుణాల కోసం రైతులు పహణీలు సమర్పించేందుకు బ్యాంకుల వద్ద బారులు తీరుతున్నారు. ఉద యం నుంచి రాత్రి వరకూ క్యూలో నిల్చుంటున్నారు.
వేమనపల్లి/చెన్నూర్ : రుణాల కోసం రైతులు పడరాని కష్టాలు పడుతున్నారు. బ్యాంకుల తెరువకముందే బ్యాంకుల ఎదుట బారులు తీరాల్సి వస్తోంది. మంగళవారం వేమనపల్లి, చెన్నూర్ పట్టణాల్లోని డెక్కన్ గ్రామీణ బ్యాంకులకు రైతులు వెల్లువలా భారీగా తరలివచ్చారు. వేమనపల్లి బ్యాంకు వద్దకు 25 గ్రామాలకు చెందిన సుమారు 1100 మంది రైతులు తరలివచ్చారు.
దీంతో అక్కడ తొక్కిసలాట నెలకొంది. ఇద్దరు రైతులు అస్వస్థతకు గురయ్యారు. చెన్నూర్‌లోని డెక్కన్ గ్రామీణ బ్యాంక్ వద్ద బ్యాంక్ తెరవకముందే పెద్ద సంఖ్యలో రైతులు వచ్చా రు. మధ్యాహ్నం రైతులు వరుసక్రమాన్ని విస్మరించడంతో తోపులాట జరిగింది. ఇందులో ఆస్నాద గ్రామానికి చెందిన ఇరుగండి భూదేవి అనే మహిళ రైతుకు గాయాలయ్యాయి. దీంతో ఆమెను ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్సై రవీందర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు.