అప్పుల బాధతో రైతు ఆత్మహత్య | farmer suicide in rangareddy distirict | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

Aug 1 2015 12:59 PM | Updated on Nov 6 2018 7:56 PM

అప్పుల బాధతో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శనివారం రంగారెడ్డి జిల్లా పరిగి మండలం రూప్‌ఖాన్‌పేట గ్రామంలో జరిగింది.

పరిగి: అప్పుల బాధతో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శనివారం రంగారెడ్డి జిల్లా పరిగి మండలం రూప్‌ఖాన్‌పేట గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన గోపాల్(38) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా, తన నాలుగు ఎకరాల పొలంలో ఈ ఏడాది మొక్కజొన్న పంట వేశాడు. అయితే, వర్షాలు సరిగా లేకపోవడంతో పంట పూర్తిగా ఎండిపోయింది. కాగా, రైతు శుక్రవారం బ్యాంకు వెళ్లి క్రాప్ లోన్ ఇవ్వాలని కోరగా, ప్రభుత్వం రుణమాఫీ సొమ్ము మాకు ఇంకా అందలేదని..లోన్ కావాలంటే పాత బకాయి వడ్డీ చెల్లించాలని బ్యాంక్ అధికారులు తేల్చిచెప్పారు. దీంతో రైతు మనస్తాపం చెంది శనివారం తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement