అప్పులబాధ తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం శంకరపట్నం గ్రామంలో చోటు చేసుకుంది.
కరీంనగర్ జిల్లా: అప్పులబాధ తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం శంకరపట్నం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పంటు కొమురయ్య(65)కు ఎనిమిదెకరాల పంట భూమి సాగు చేయటానికి రూ. 11 లక్షల 50 వేలు అప్పు చేశాడు. దీనికి తోడు కుమారుడు శ్రీనివాస్ చికిత్స నిమిత్తం అప్పులు చేశాడు.
పంట దిగుబడి తగ్గడంతో పాటు రెండెకరాల్లో పంట ఎండిపోయింది. దీంతో అప్పులు తీర్చే దారిలేక మనస్తాపం చెందిన కొమురయ్య మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనను చికిత్స నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కొమురయ్య బుధవారం ఉదయం మృతి చెందాడు. ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది.