విద్యుత్ షాక్‌తో రైతు దుర్మరణం | Farmer dies due to Electrocution | Sakshi
Sakshi News home page

విద్యుత్ షాక్‌తో రైతు దుర్మరణం

May 24 2015 10:11 AM | Updated on Oct 1 2018 4:01 PM

మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్ మండలం ఉత్తులూర్‌లో ఆదివారం ఉదయం విద్యుదాఘాతంతో ఒక రైతు మృతిచెందాడు.

నారాయణ్‌ఖేడ్ : మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్ మండలం ఉత్తులూర్‌లో ఆదివారం ఉదయం విద్యుదాఘాతంతో ఒక రైతు మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే...  ఉత్తులూర్‌ గ్రామానికి చెందిన కౌలు రైతు నీరుడి నారాయణ(60)  ఆదివారం ఉదయం పొలానికి వెళ్లాడు. అక్కడ తెగిపడి ఉన్న కరెంట్ తీగ కాలికి తగలడంతో షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే అతని మృతికి కారణమని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement