ఇద్దరు రైతుల ఆత్మహత్య | farmer commits suicide in warangal district | Sakshi
Sakshi News home page

ఇద్దరు రైతుల ఆత్మహత్య

Apr 15 2016 10:52 AM | Updated on Oct 1 2018 2:36 PM

వరంగల్ జిల్లా కురవి మండలం నెరాడ గ్రామంలో ఓ కౌలు రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

కురవి : వరంగల్ జిల్లా కురవి మండలం నెరాడ గ్రామంలో ఓ కౌలు రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. గ్రామ శివారులో ఓ మామిడితోటలో చెట్టుకు ఉరివేసుకుని నీలం వెంకన్న(45) అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు గమనించి పోలీసులకు, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులు కారణంగా తెలిస్తోంది.


మహబూబ్‌నగర్ జిల్లా ధన్వాడ మండలం వెంకటాపూర్ గ్రామంలో కుర్వ ధశరద్(40) అనే మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పొలంలో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడని కుటుంబసభ్యులు తెలిపారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




 
 
 

Advertisement
 
Advertisement
Advertisement