రుణభారంతో రైతు బలవన్మరణం | Farmer commits suicide | Sakshi
Sakshi News home page

రుణభారంతో రైతు బలవన్మరణం

Dec 7 2015 7:51 PM | Updated on Nov 6 2018 7:56 PM

అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం ఇరవెన్ను గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.

పాలకుర్తి (వరంగల్) : అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం ఇరవెన్ను గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పొన్నాల పెద్ద రాంచంద్రం(55) తనకున్న నాలుగెకరాల్లో పత్తి సాగు చేశాడు. పంటల సాగుకు రూ. 3 లక్షలు అప్పు చేశాడు. రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితులతో పంట దిగుబడి తగ్గడంతో అప్పు ఎలా తీర్చాలోననే మనోవేదనతో సోమవారం సాయంత్రం ఇంట్లో పురుగు మందు తాగాడు. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తుండగానే మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఎస్‌ఐ నాగభూషణం కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement