బెంగళూరులో నకిలీ సూపరింటెండెంట్‌ అరెస్ట్‌

Fake superintendent arrested in Bangalore - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ అంటూ మహిళను ట్రాప్‌ చేసే ప్రయత్నం చేసి న వ్యక్తిని బెంగళూరులోని బసవనగుడి పోలీసులు అరెస్ట్‌చేశారు. బెంగళూరు అగ్రహారం ప్రాంతానికి చెందిన అబ్దుల్‌ ముబారక్‌ అలియాస్‌ హాజీ షేక్‌ కారు మెకానిక్‌గా పనిచేస్తుంటాడు.

సులభంగా డబ్బు సంపాదించేందుకు తెలంగాణ అబ్కారీ శాఖ పేరును వాడుకోవడం మొదలుపెట్టాడు.  ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన ఓ మహిళను ట్రాప్‌ చేసి  పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మబలికాడు. నెల క్రితం  ఆమెను బం గారు ఆభరణాలు కొనిస్తానని చెప్పి దుకాణానికి తీసుకెళ్లి బంగారు ఆభరణాలు, ఆ మహిళ కారు తో పరారయ్యాడు. దీని పై బాధితు రాలు పోలీసులకు ఫిర్యా దు చేయటంతో అతడిని అరెస్ట్‌ చేసి కారు, నకిలీ ఐడీ కార్డు, 28 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top