వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి సీటీవోగా అవతారమెత్తి వసూళ్ల దందాకు తెరతీశాడు.
వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి సీటీవోగా అవతారమెత్తి వసూళ్ల దందాకు తెరతీశాడు. చివరికి కటకటాలపాలయ్యాడు. వివరాలివీ.. మహబూబ్‌నగర్ జిల్లా మానవపాడు కమర్షియల్ ట్యాక్స్ అధికారి(సీటీవో) పోస్టు 8 నెలలుగా ఖాళీగా ఉంది.
ఇదే అదనుగా ఆ కార్యాలయంలో కాంట్రాక్టు పద్ధతిలో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న కానాపురం సత్యనారాయణ పరకాయ ప్రవేశం చేశాడు. తనే సీటీవోగా చెప్పుకుంటూ దందా ప్రారంభించాడు. గత ఎనిమిది నెలలుగా దాదాపు రూ.20 లక్షలు వసూలు చేసుకున్నాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు వారు అతనిపై ఓ కన్నేసి ఉంచారు. శుక్రవారం వేకువజామున మానవపాడు టోల్‌గేట్ వద్ద ట్యాక్స్ పేరిట వసూళ్లకు పాల్పడుతుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.