తెలంగాణకు న్యాయమైన వాటా రావాలి: హరీశ్‌రావు | fair share for Telangana, says Harish rao | Sakshi
Sakshi News home page

తెలంగాణకు న్యాయమైన వాటా రావాలి: హరీశ్‌రావు

May 24 2014 2:28 AM | Updated on Sep 2 2017 7:45 AM

తెలంగాణకు న్యాయమైన వాటా రావాలి: హరీశ్‌రావు

తెలంగాణకు న్యాయమైన వాటా రావాలి: హరీశ్‌రావు

తెలంగాణ ఉద్యమంలో ఒక దశ మాత్రమే పూర్తయిందని, పోరాటం ఇంకా ముగియలేదని టీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు అన్నారు.

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో ఒక దశ మాత్రమే పూర్తయిందని, పోరాటం ఇంకా ముగియలేదని టీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు అన్నారు. పార్టీ నేతలు కె.స్వామిగౌడ్, వి.శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి తెలంగాణ భవన్‌లో ఏర్పాటైన వార్‌రూం కార్యకలాపాలను శుక్రవారం ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, ఉద్యోగాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా రావాలని పేర్కొన్నారు.
 
 బంగారు తెలంగాణ సాకారమయ్యేదాకా పోరాటం సాగుతుందని స్పష్టం చేశారు. పంపిణీ జరుగుతున్నప్పుడు అనుసరిస్తున్న వైఖరితోనే కాంగ్రెస్, టీడీపీ నేతల నైజం బయటపడుతోందని హరీష్ వ్యాఖ్యానించారు. ఉద్యోగుల స్థానికత, అక్రమాలు, వాస్తవాలపై టీఆర్‌ఎస్ కార్యాలయంలోని కమిటీకి ప్రత్యక్షంగా కానీ, కొరియర్  లేదా ఈమెయిల్ (trswarroom@gmail.com)ద్వారా  సమాచారం అందించవచ్చునని హరీష్ రావు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement