కొత్త బార్లకు గ్రీన్ సిగ్నల్ | Excise Department Green signal to new bars | Sakshi
Sakshi News home page

కొత్త బార్లకు గ్రీన్ సిగ్నల్

Oct 30 2016 4:36 AM | Updated on Sep 4 2017 6:41 PM

కొత్త బార్లకు గ్రీన్ సిగ్నల్

కొత్త బార్లకు గ్రీన్ సిగ్నల్

కొత్త బార్లు ఏర్పాటు చేసుకునేందుకు ఎక్సైజ్ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

నల్లగొండ :  ఎక్సైజ్ శాఖ కొత్తబార్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనాభా ప్రాతిపదిక న ఇప్పుడున్న వాటికి అధనంగా కొత్త బార్లు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం లభించింది. గ్రేటర్ హైదరాబాద్‌లో 13 వేల జనాభాకు, పట్టణాలు, నగరపంచాయతీల్లో 25 వేల జనాభాకు ఒక బారు చొప్పున ఏర్పాటు చేసేలా మార్గదర్శకాలు రూపొం దించారు. దీని ప్రకారం మూడు జిల్లాల్లో కలిపి కొత్తగా 8 బార్లు మంజూరు చేశారు.
 
నల్లగొండ మున్సిపాలిటీలో నాలుగు, దేవరకొండ నగరపంచాయతీలో రెండు, హుజూర్‌నగర్‌లో రెండు బార్లకు అనుమతి ఇచ్చారు. మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరిలో జనాభాకు మించి ఎక్కువగానే బార్లు ఉన్నాయి. కోదాడ మున్సిపాలిటీలో గతంలో మంజూరు చేసిన మూడు బార్లకు ఉన్న అడ్డం కులు తొలగిపోయాయి. త్వరలో కోదాడ బార్లకు సంబంధించి ఎక్సైజ్ శాఖ  డ్రా ద్వారా లెసైన్స్ దారులను ఎంపిక చేయనుంది. కొత్తగా మంజూరైన ఏడు బార్లకు మాత్రం ఎక్సైజ్ నోటిఫికేషన్ జారీ చేసింది.  
 

Advertisement
 
Advertisement
Advertisement