ఎగ్జిబిషన్‌ ఆదాయంతో విద్య ప్రశంసనీయం

Excellence education with Exhibition Revenue - Sakshi

 హోంమంత్రి మహమూద్‌ అలీ  

నూమాయిష్‌ను ప్రారంభించిన మంత్రి  

హైదరాబాద్‌: అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నూమాయిష్‌) నిర్వహించడం వల్ల వచ్చే ఆదాయంతో 18 విద్యాసంస్థలు, 30 వేల మంది విద్యార్థులకు విద్యను అందించడం ప్రశంసనీయమని హోంమంత్రి మహమూద్‌ అలీ అన్నారు. మంగళవారం నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో 79వ అఖిల భారత పారశ్రామిక ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశంలోనే నం.1 సీఎంగా ఉన్నారని కొనియాడారు. రానున్న రోజుల్లో బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేయడం తథ్యమ న్నారు.

ఈ ఏడాది మెట్రోరైళ్లు అందుబాటులో ఉండటం వల్ల 3 నుంచి 5 లక్షల మంది సందర్శకులు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తు న్నట్లు తెలిపారు. సందర్శకుల సౌకర్యార్థం మె ట్రో సమయాలను కూడా పొడిగించినట్లు వెల్లడించారు. ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ చిన్న చిన్న పరిశ్రమలు, ఉత్పతులను ప్రజలకందించాలనే ఉద్దేశంతో నాడు నిజాం ఈ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించినట్లు గుర్తుచేశారు.  ఎగ్జిబిషన్‌లో వచ్చిన ఆదాయంతో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు తెలిపారు.  కార్యక్రమంలో ఎగ్జిబిషన్‌ సొసైటీ కార్యదర్శి జీవీ రంగారెడ్డి, జాయింట్‌ సెక్రటరీ సురేందర్‌రెడ్డి, కోశాధికారి చంద్రశేఖర్‌  పాల్గొన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top