‘ప్లాస్మా థెరపీకి కేంద్రం నుంచి అనుమతి’ | Etela Rajender fires Social media fake posts | Sakshi
Sakshi News home page

‘ప్లాస్మా థెరపీకి కేంద్రం నుంచి అనుమతి’

Apr 24 2020 6:52 PM | Updated on Apr 24 2020 7:35 PM

Etela Rajender fires Social media fake posts - Sakshi

సాక్షి, హైదరాబాద్ : రాజకీయ పార్టీలు సూచనలు చేస్తే, భేషజాలు లేకుండా తప్పకుండా పాటిస్తామని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. కేంద్ర వైద్యా ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ తెలంగాణ ప్రభుత్వ పనితీరును ప్రశంసించారన్నారు. తెలంగాణలో 9 ల్యాబ్‌లు ఉన్నాయి. పరికరాలు, ఎక్విప్‌మెంట్ల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం పన్నులు మినహాయించాలని కోరారు. ప్లాస్మా థెరపీకి కేంద్రం నుంచి అనుమతి వచ్చిందని, సీరియస్‌గా ఉన్న కరోనా పేషంట్లకు ప్లాస్మా థెరపీ చేస్తామని ఈటల చెప్పారు.

తెలంగాణలో మొత్తం 983 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. తెలంగాణలో ఇప్పటివరకు 25 మంది మృతిచెందగా, 291 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. తెలంగాణలో యాక్టిక్ కేసులు 663 ఉన్నాయని పేర్కొన్నారు. సూర్యాపేట, గద్వాల, జీహెచ్‌ఎంసీ, వికారాబాద్ ప్రాంతాల నుంచే ఎక్కువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయన్నారు. కొందరు సైకోలు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఈటల మండిపడ్డారు. గాంధీ ఆస్పత్రిలో కరోనా బాధితులకు భోజనం బాగాలేదని.. కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ దుష్ప్రచారాం తగదన్నారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది మనోస్థైర్యం దెబ్బతీయొద్దని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement