'హుజూర్‌నగర్‌ను అభివృద్ధి చేసిన కాంగ్రెస్‌ను గెల్పించండి' | Elect Congress For The All Round Development Of Huzurnagar | Sakshi
Sakshi News home page

'హుజూర్‌నగర్‌ను అభివృద్ధి చేసిన కాంగ్రెస్‌ను గెల్పించండి'

Sep 28 2019 6:53 PM | Updated on Sep 28 2019 7:10 PM

Elect Congress For The All Round Development Of Huzurnagar - Sakshi

సాక్షి, సూర్యాపేట: హుజూర్‌నగర్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేసిన కాంగ్రెస్‌ను గెల్పించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. శనివారం హుజూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ నేతల ఆగడాలు తట్టుకోలేక పాలకీడు మండలం బెట్టే తండా సర్పంచ్ మోతిలాల్, జెడ్పీటీసీ, పాలకీడు సర్పంచ్ జితేందర్ రెడ్డిలు మూడు రోజుల క్రితం సొంత పార్టీ కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరారని అన్నారు.

తాను జీవితంలో ఎన్నడూ చూడని నీచ రాజకీయాలను టీఆర్‌ఎస్‌ చేస్తుందనీ విమర్శించారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేసి, డబ్బు ఆశ చూపి టీఆర్‌ఎస్‌లోకి చేర్పించుకుంటున్నారని ఉత్తమ్ మండిపడ్డారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికలు జరగాలని డిమాండ్‌ చేశారు. అలాగే అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాలలు ఎలా వచ్చాయో పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement