విషాదం మిగిల్చిన ‘దీపం’  | Elderly women burned alive | Sakshi
Sakshi News home page

విషాదం మిగిల్చిన ‘దీపం’ 

Jan 7 2020 2:59 AM | Updated on Jan 7 2020 2:59 AM

Elderly women burned alive  - Sakshi

మంటల్లో కాలుతున్న పెంకుటిల్లు

నిజాంసాగర్‌(జుక్కల్‌): దీపం మంటలకు ఓ వృద్ధురాలు సజీవ దహనమైంది. కామారెడ్డి జిల్లా జుక్కల్‌ మండలం కౌలాస్‌ గ్రామంలో సోమవారం వేకువజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సాలే విఠవ్వ (80) ఆదివారం రాత్రి ఇంట్లో దీపం వెలిగించి మంచం పక్కన పెట్టుకుని నిద్రకు ఉపక్రమించింది.

ప్రమాదవశాత్తు మంటలు బట్టలకు అంటుకున్నాయి. అవి క్షణాల్లో దావానలంలా వ్యాపించడంతో ఇల్లు దగ్ధమైంది. గమనించిన స్థానికులు ఫైరింజన్‌కు, పోలీసులకు సమాచారమిచ్చారు. అయితే, అప్పటికే మంటలకు వృద్ధురాలు సజీవ దహనమైంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement