వృద్ధ వికలాంగుడి ఆకలిచావు | Elderly challenged starvation death | Sakshi
Sakshi News home page

వృద్ధ వికలాంగుడి ఆకలిచావు

Apr 24 2015 2:02 AM | Updated on Sep 5 2018 2:12 PM

ఓ వృద్ధ వికలాంగుడు ఆకలి చావుకు గురయ్యాడు.

వనపర్తి రూరల్: ఓ వృద్ధ వికలాంగుడు ఆకలి చావుకు గురయ్యాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి మండలం కడుకుంట్లలో జరిగింది. గ్రామానికి చెందిన తలారి లక్ష్మయ్య (70) వికలాంగుడు కావడంతో ఏ పనీ చేయలేక ఇంటివద్దే ఉండేవాడు. ఉన్న ఇద్దరు కూతుళ్లు అత్తారింటికి, కుమారుడు ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వె ళ్లగా, భార్య మూడేళ ్లక్రితమే మృతి చెందింది.

అప్పటి నుంచి ఇంట్లో ఒంటరిగా జీవిస్తుండడంతో కాలనీవాసులు ఆయన పరిస్థితిని చూసి అప్పుడప్పుడు అన్నం పెట్టేవారు. కొంతకాలంగా సమయానికి భోజనం వండిపెట్టే వారు లేక నీరసంగా కనిపించేవాడు. ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా కావడం, ఆహారం తీసుకోకపోవడంతో ఆరోగ్యం క్షీణించింది. చివరకు బుధవారం సాయంత్రం మృతిచెందాడు. గురువారం ఉదయం విషయం వెలుగులోకి వచ్చింది.
 

Advertisement
 
Advertisement
Advertisement