ఈబీసీ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం | EBC reservation is constitutional | Sakshi
Sakshi News home page

ఈబీసీ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం

Jan 10 2019 2:34 AM | Updated on Jan 10 2019 2:34 AM

EBC reservation is constitutional - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య ఆరోపించారు. జనాభాలో 70 శాతానికి పైగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వకుండా, ఈబీసీ రిజర్వేషన్లు కల్పించడంతో తీవ్ర అన్యాయం జరిగినట్లేనని ఆయన బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల నేపథ్యం లో ఓట్లు రాబట్టేందుకు బీజేపీ ప్రభుత్వం చేసిన ఎత్తుగడ అని అన్నారు. అగ్రకుల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తూ.. పార్లమెంటులో బిల్లు పెట్టడాన్ని మాలమహానాడు తీవ్రంగా ఖండించింది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement