‘దుబ్బాక’ చేనేతకు రూ.10 కోట్లు


- ఫలించిన దుబ్బాక ఎమ్మెల్యే వీఐపీ రిపోర్టింగ్

- ‘సాక్షి’ కథనాన్ని సీఎంకు చూపించి ఒప్పించిన రామలింగారెడ్డి


సాక్షి ప్రతినిధి,సంగారెడ్డి:
దుబ్బాక చేనేతకు మహర్దశ పట్టనుంది. తెలంగాణ తొలిబడ్జెట్‌లో టెక్స్‌టైల్‌పార్కు కోసం కేటాయించిన రూ.10 కోట్ల నిధులు చేనేతల అభివృద్ధి కోసం వినియోగించుకోవాల్సిందిగా సీఎం కేసీఆర్ సూచించారు. అయి తే ఈ కేటాయింపులకు దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కూడా కారణమయ్యారు. ఆయన ఇటీవల ‘సాక్షి’ విఐపి రిపోర్టర్‌గా వ్యవహరించి చేనేత కార్మికులు పడుతున్న అవస్థలు, రోజంతా కష్టం చేసినా కనీసం రూ.100 కూడా కూలీ గిట్టుబాటు కా ని విధానాన్ని వెలుగులోకి తెచ్చారు.



‘సాక్షి’ ఈ కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది. ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. టెక్స్‌టైల్‌పార్కు నిధులను దు బ్బాక చేనేత సొసైటీ అభివృద్ధికి విని యోగించాలని  జిల్లా జౌళి శాఖ  ఏడీకి సీఎం ఆదేశాలిచ్చారు.  దుబ్బాక నియోజకవర్గంలో ఒక్క వపర్‌లూం కూడా లేదని, అన్ని హ్యాండ్‌లూం మగ్గాలే ఉన్నాయని, అలాంటప్పుడు టెక్స్‌టైల్ పార్కు నిధులు కేటాయించడం వల్ల ఆశించిన ఫలితాలు రావని తాను ముఖ్యమంత్రికి వివరించానని ఎమ్మెల్యే తెలిపారు.



చేనేత కార్మికులు రోజంతా కష్టం చేసినా రోజుకు  రూ. 60 మాత్రమే కూలీ పడుతోందని, దుబ్బాక చేనేత కార్మికులకు నాణ్యమైన బట్టలు నేసే పనితనం ఉన్నా.. పెట్టుబడి పెట్టి నాణ్యమైన ముడి సరుకులు కొని బట్టలు కొనలేకపోతున్నారని,వారికి కొద్దిపాటి ఆర్థిక సహకారం అందిస్తే ప్రతి చేనేత కూడా లె నిన్ బట్టలు నేస్తారని, అప్పుడు వారికి నెలకు కనీసం రూ.15 వేల నుంచి 20 వరకు గిట్టుబాటు అవుతుందని, ముఖ్యమంత్రి కేటాయించిన రూ. 10 కోట్లలో కొంత డబ్బును ఇందుకోసం వినియోగించే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయమని జిల్లా జౌళి శాఖ ఏడీని ఆదేశించినట్లు ఆయన తెలిపారు.  

 

డైయింగ్ సెంటర్ ఏర్పాటు కోసం రూ 50 లక్షలు అవసరమవుతాయని, ఇలాంటివి దుబ్బాక నియోజకవర్గంలో కనీసం ఐదు గ్రామాల్లో ఏర్పాటు చేసే విధంగా ప్రతిపాదనలు చేయాలని, మరి కొంత డబ్బుతో  వీవర్ కమ్యునిటి హాల్ కట్టుకునే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జౌళి శాఖ ఏడీని కోరినట్లు ఎమ్మెల్యే రామలింగారెడ్డి తెలిపారు.

 

ముఖ్యమంత్రి, మంత్రి, ‘సాక్షి’లకు కృతజ్ఞతలు: సోలిపేట

‘సాక్షి’ వీఐపీ రిపోర్టింగ్ చేయబట్టే తాను క్షేత్రస్థాయిలోకి వెళ్లి వాస్తవ పరిస్థితిని గమనించానని, తాను చూసిన విషయాలనే ముఖ్యమంత్రికి చెప్పి ఒప్పించగలిగానని,  తన నియోజకవర్గం చేనేత కార్మికుల పట్ల సానుకూలంగా స్పందించి నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు,రూ 10 కేటాయించడంలో  సహకరించిన భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావుకు, తనను క్షేత్రస్థాయిలోకి తీసుకొనిపోయి చేనేతల కష్టాలను కళ్లకు గట్టిన ‘సాక్షి’కి ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top