మందుల దుకాణాలపై దాడులు | Drug regulatory authorities attacked on Drugs shops | Sakshi
Sakshi News home page

మందుల దుకాణాలపై దాడులు

May 9 2014 4:10 AM | Updated on May 25 2018 2:11 PM

ప్రిస్కిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తున్న మందుల దుకాణాలపై ఔషధ నియంత్రణ మండలి కొరడా ఝుళిపించింది. గ్రేటర్ పరిధిలో గురువారం తనిఖీలు నిర్వహించి.. 40 దుకాణాలు నిబంధనలకు విరుద్ధంగా మందులు విక్రయిస్తున్నట్లు గుర్తించింది.

సాక్షి, హైదరాబాద్: ప్రిస్కిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తున్న మందుల దుకాణాలపై ఔషధ నియంత్రణ మండలి కొరడా ఝుళిపించింది. గ్రేటర్ పరిధిలో గురువారం తనిఖీలు నిర్వహించి.. 40 దుకాణాలు నిబంధనలకు విరుద్ధంగా మందులు విక్రయిస్తున్నట్లు గుర్తించింది. రూ.కోటిన్నరకుపైగా విలువచేసే నిషేధిత మత్తు మందులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
 
 ఇటీవల సాక్షిలో ‘గోళీమార్’ శీర్షికన ప్రచురితమైన వార్తా కథనంపై మండలి సీరియస్‌గా స్పందించింది. డెరైక్టర్ జనరల్ డీఎల్ మీనా ఆదేశాల మేరకు అధికారులు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు మందుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. ప్రిస్కిప్షిన్ లేకుండా మందులు అమ్మడం, గడువు ముగిసిన  వాటిని విక్రయించడం, రికార్డులను సరిగా నిర్వహించకపోవడం వంటి కారణాలతో పలువురు వ్యాపారులు పట్టుబడ్డారు. ఈ దుఖానాలకు త్వరలో నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement