సంగారెడ్డి డివిజన్: మెదక్ జిల్లాకు వాహనాల రిజిస్ట్రేషన్ కోసం తెలంగాణ ప్రభుత్వం కొత్త సిరీస్‌ను కేటాయించింది. మెదక్ జిల్లాకు ఏపీ 23 స్థానంలో టీఎస్ 15 సిరీస్‌ను రవాణాశాఖ ఖరారు చేసింది. ఈమేరకు గురువారం ఉ త్తర్వులు జారీ అయ్యాయి. గత కొన్ని రోజులుగా మెద క్ జిల్లా వాస్తులు, వాహనదారులు జిల్లాకు ఏ కోడ్ వ స్తుందోనని ఎదరుచూస్తున్నారు. వారి ఎదురుచూపుల కు సమాధానం దొరికింది. ఇకపై నూతన వాహనాల రిజిస్ట్రేషన్ జిల్లాలో టీఎస్ 15 సిరీస్‌తో ప్రారంభం కా నున్నాయి. సోమవారం నుంచి కొత్త సిరీస్‌తో వాహనా ల రిజిష్ట్రేషన్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నా యి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన 2వతేదీ నుంచి జిల్లాలో తాత్కాలికంగా వాహనాల రిజిస్ట్రేషన్ నిలిపివేశారు. తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లాకు కొత్త సిరీస్ కేటాయించాల్సి ఉన్నందున రిజిస్ట్రేషన్ నిలిపివేశారు. జిల్లాలో ప్రతిరోజు సుమారు 70 నుంచి 80 కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ జరుగుతాయి. రవాణాశాఖ సంగారె డ్డి, సిద్దిపేట, పటాన్‌చెరులలో వాహనాల రిజిస్ట్రేషన్ చేస్తుంది. గత రెండు వారాలుగా జిల్లాలో సుమారు వెయ్యికిపైగా వాహనదారులు వాహనాల రిజిస్ట్రేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా ప్రభుత్వం జిల్లాకు టీఎస్ 15 సిరీస్ కేటాయించటంతో వాహనదారుల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.
రెండు రోజుల్లో జిల్లాలో టీఎస్ 15 సిరీస్‌తో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే కొత్త వాహనాలు కొనుగోలు చేసిన వాహనదారులతోపాటు పాత వాహనదారులు సైతం రిజిస్ట్రేషన్ సిరీస్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది. ఏపీ 23 స్థానే పాత వాహనదారులు తమ వాహనాల నెంబర్ ప్లేట్లపై టీఎస్ 15 రిజిస్ట్రేషన్ సిరీస్ చేర్చుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఉదాహారణకు జిల్లాకు చెందిన వాహనం ఏపీ 23 ఎఫ్ 5544 ఉంటే కొత్తగా వాహనం నెంబరు టీఎస్ 15 ఎఫ్ 5544 గా ఉంటుంది. సిరీస్ మారనున్న నేపథ్యంలో రవాణాశాఖ అధికారులు నామమాత్ర ఫీజు వసూలు చేసే అవకాశం ఉంటుంది.
పాత వామనదారులు రిజిస్ట్రేషన్ సిరీస్ మార్చుకోవటంపై అధికారులు రెండు రోజుల్లో స్పష్టత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాగా ఉమ్మడి రాష్ట్రంలో ఫ్యాన్సీ నెంబర్ల కోసం డబ్బులు జమచేసిన వారికి టీఎస్ 15 సిరీస్‌తోనే ఫ్యాన్సీ నెంబరు కేటాయించవచ్చని తెలుస్తోంది. దీంతో ఫ్యాన్సీ నెంబరు కోసం డబ్బులు జమచేసిన వారు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని అధికారులు చెబుతున్నారు. వాహనాల రిజిస్ట్రేషన్ కొత్త సీరీస్ పై స్పష్టత రావటంతో అధికారులు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లపై అంశంపై దృష్టి సారించనున్నారు.
జిల్లాకు టీఎస్ 15 సిరీస్ కేటాయింపు
Published Fri, Jun 13 2014 11:34 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్‌ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్‌వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి
- రగులుతున్న క్యాంపస్‌లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement