నేటి నుంచి 12 కిలోల ఉచిత బియ్యం పంపిణీ

Distribution Of 12 kg Of Free Rice By Telangana Government From 01/06/2020 - Sakshi

2.81 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం

కందిపప్పు పంపిణీపై సందిగ్ధం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర వ్యా ప్తంగా సోమవారం నుంచి ప్ర భుత్వం అందిస్తున్న 12 కిలోల ఉ చిత రేషన్‌ బియ్యం పంపిణీ మొదలు కానుంది. రాష్ట్రంలోని 2.81కోట్ల మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 12 కిలోల వంతున బియ్యం ఉచితంగా పంపిణీ చేసే లా పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేసింది. మొత్తం గా 3.34 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని ఇప్పటికే రేషన్‌ దుకాణాలకు సరఫరా చేసింది. పంపిణీ కోసం రేషన్‌ దుకాణాలు ఉదయం, సాయంత్రం అన్ని వేళలు పనిచేసేలా చర్యలు చేపట్టింది. లబ్ధిదారులు రేషన్‌ దుకాణాల మధ్య గుమికూడకుండా, విడతల వారీగా వారికి బియ్యం ఇచ్చే కూపన్లు ఇవ్వనున్నారు.

కూపన్‌లు తీసుకొని చెప్పిన సమయానికే లబ్ధిదారులు రేషన్‌ దుకాణాల వద్దకు వచ్చి తీసుకోవాలి. ప్రతి రేషన్‌ దుకాణం వద్ద శానిటైజర్లు, స బ్బు, నీటిని అందుబాటులో ఉంచాలని పౌరసరఫ రాల శాఖ రేషన్‌ డీలర్లను ఆదేశించింది. ఇక కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న కందిపప్పు పంపిణీపై మా త్రం సందిగ్ధత నెలకొంది. ఏప్రిల్, మే, జూన్‌ నెల ల్లో 8,800 టన్నులు కేటాయించాల్సి ఉండగా, ఆ స్థాయిలో కేటాయింపులు లేవు. మరి ఈ నెలలో కేంద్రం ఏం చేస్తుందన్న దానిపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top