ఈనెల 15 నుంచి ఒంటిపూట బడులు

Director Of School Education Says Half Day School Starts From 15th March - Sakshi

ఆదేశాలు జారీచేసిన డైరెక్టర్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రం లోని పాఠశాలల కు ఈనెల 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులను అమలు చేయాలని ఆర్జేడీలు, డీఈవోలను పాఠశాల విద్యా డైరెక్టర్‌ విజయ్‌కుమార్‌ ఆదేశించారు. అన్ని యాజమాన్యాల పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను ఉదయం 8 గంటల నుంచి మ«ధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించాలని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు మధ్యాహ్నం 12:30 గంటలకు అందించాలని స్పష్టం చేశారు. అలాగే హైస్కూళ్లకు ఆప్షనల్‌ హాలిడేస్‌ అమలు చేయాలని పేర్కొన్నారు. ఒంటిపూట బడులను పాఠశాలలకు చివరి పనిదినం అయిన ఏప్రిల్‌ 12 వరకు కొనసాగించాలని, ఆ తరువాత వేసవి సెలవులు వర్తిస్తాయని వివరించారు. దీంతో తిరిగి పాఠశాలలు జూన్‌ 1న ప్రారంభం కానున్నాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top