పాడుబడిన బావిలో మొసలి | Dilapidated well In Crocodile | Sakshi
Sakshi News home page

పాడుబడిన బావిలో మొసలి

Aug 6 2015 4:02 AM | Updated on Mar 28 2018 11:08 AM

పాడుబడిన బావిలో మొసలి - Sakshi

పాడుబడిన బావిలో మొసలి

పాడుబడిన ఓ బావిలో మొసలి కనిపించిన ఘటన రంగారెడ్డి జిల్లా మర్పల్లి మండలం బిల్‌కల్‌లో బుధవారం వెలుగుచూసింది.

మర్పల్లి: పాడుబడిన ఓ బావిలో మొసలి కనిపించిన ఘటన రంగారెడ్డి జిల్లా మర్పల్లి మండలం బిల్‌కల్‌లో బుధవారం వెలుగుచూసింది. వివరాలు.. గ్రామానికి చెందిన చింతల గట్టు అంతయ్య బుధవారం తన పొలంలోని పాడుబడిన బావి చుట్టు ఉన్న పిచ్చిమొక్కలు తొలగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయనకు బావిలో ఓ మొసలి పిల్ల కనిపించింది. వికారాబాద్ ఫారెస్టు బీట్ అధికారి అరుణ, మెదక్ జిల్లా సంగారెడ్డి బీట్ అధికారి సత్యనారాయణ ఆధ్వర్యంలో మొసలి పిల్లను పట్టుకున్నారు. దానిని మెదక్ జిల్లా మంజీర ప్రాజెక్టులో వదిలి పెడుతామని అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement