మేడారంలో 10 వేల మందితో భారీ భద్రత | DGP reviews on security arrangements at Medaram Jatara | Sakshi
Sakshi News home page

మేడారంలో 10 వేల మందితో భారీ భద్రత

Feb 14 2016 4:15 PM | Updated on Sep 3 2017 5:39 PM

మేడారంలో 10 వేల మందితో భారీ భద్రత

మేడారంలో 10 వేల మందితో భారీ భద్రత

మేడారం సమ్మక్క సారక్క జాతరకు 10వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ తెలిపారు.

వరంగల్: మేడారం సమ్మక్క సారక్క జాతరకు 10వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ తెలిపారు. ఆదివారం ఆయన జాతర జరిగే ప్రాంతాన్ని సందర్శించారు.

అమ్మవారి గద్దెల చుట్టూ పర్యవేక్షించిన అనంతరం భద్రత ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలపై ఆయన అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా అనురాగ్శర్మ మాట్లాడుతూ...ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యల్ని తీసుకుంటున్నామని తెలిపారు. డీజీపీ వెంట ఐజీ నవీన్‌చంద్, ఎస్పీ అమరకిషోర్ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement