బాసర సరస్వతీ ఆలయానికి పోటెత్తిన భక్తులు | Devotees throng to basara saraswati temple | Sakshi
Sakshi News home page

బాసర సరస్వతీ ఆలయానికి పోటెత్తిన భక్తులు

Oct 1 2014 9:08 AM | Updated on Sep 2 2017 2:14 PM

చదువుల తల్లి బాసర సరస్వతీ ఆలయానికి భక్తులు పోటెత్తారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో నేడు కీలక ఘట్టం. బుధవారం

బాసర : చదువుల తల్లి బాసర సరస్వతీ ఆలయానికి భక్తులు పోటెత్తారు.  దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో నేడు కీలక ఘట్టం. బుధవారం సరస్వతి అమ్మవారి జన్మనక్షవూతమైన మూలా నక్షత్రం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున బాసర తరలి వచ్చారు.   అమ్మవారి జన్మనక్షత్రమైన మూల నక్షత్రం రోజున చేసే సరస్వతి అలంకారం విశేష ప్రాధాన్యతను సంతరించుకొంటుంది. ఆరోజున పిల్లలందరూ సరస్వతిని విధిగా ఆరాధిస్తుంటారు.

ఈ తల్లి అనుగ్రహం కలిగి సకల విద్యాప్రాప్తి జరగాలని కోరుకొంటారు.  చదువుల తల్లి జన్మదినం సందర్భంగా  ఆ సన్నిధిలో అక్షరభ్యాసం  చేయిస్తే తమ చిన్నారులు విద్యావంతులు అవుతారని భక్తుల నమ్మకం. ఈక్రమంలోనే వందలాది మంది చిన్నారులకు అక్షరాభాస్య పూజలు జరుగుతాయి. మరోవైపు భక్తులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement