breaking news
Mula Nakshatra
-
ఓం శ్రీ శారదాయై నమః
దుర్గాదేవి అలంకారాలన్నిటిలో మూలానక్షత్రం నాటి సరస్వతీదేవి అలంకారానికి ఎనలేని ప్రాముఖ్యత ఉంది. చదువుల తల్లి సరస్వతీదేవిగా భక్తులు ఈమెను ఆరాధన చేస్తారు. వాక్కు, బుద్ధి, విజ్ఞానం, కళలు... అన్నిటికీ ఈమే అధిష్ఠాన దేవత. ఋగ్వేదం, దేవీభాగవతం, బ్రహ్మవైవర్త పురాణాల్లో సర్వసతీదేవి గురించిన అనేక గాథలు విస్తారంగా వర్ణితమై ఉన్నాయి. కచ్ఛపి అనే వీణ; పుస్తకం, అక్షమాల, ధవళ వస్త్రాలు ధరించి, హంసను అధిరోహించిన రూపంలో ఈ తల్లి దర్శనమిస్తుంది. సర్వశక్తి స్వరూపిణి, సర్వాంతర్యామిని, విజ్ఞానదేవత, వివేకధాత్రిగా శాస్త్రాలు, పురాణ, ఇతిహాసాలు సరస్వతీదేవిని వర్ణిస్తున్నాయి. సరస్వతీ ఉపాసనతో లౌకిక విద్యలతో పాటు అలౌకికమైన మోక్షవిద్య కూడా అవగతమవుతుంది. సకల చరాచరకోటిలో వాగ్రూపంలో ఉంటూ, వారిని చైతన్యవంతులుగా చేసే శక్తి ఈమెది.సరస్వతీ ఉపాసన ద్వారా సకల విద్యలూ కరతలామలకం అవుతాయని పెద్దలు చెబుతారు. తెల్లని వస్త్రాలు ధరించి, తెల్లని పూలతో అమ్మను పూజించాలి.శ్లోకం: యా కుందేందు తుషార హార ధవళా యాశుభ్ర వస్త్రాన్వితా, యా వీణా వరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైస్సదా పూజితా, సామాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా.మంత్రం: ’ఓం శ్రీం హ్రీం క్లీం మహా సరస్వత్యై నమ:’ అనే మంత్రాన్ని ఉపాసన చేయాలి. సరస్వతీదేవి ప్రీతిగా ఈ రోజున పుస్తకదానం చేయాలి. సరస్వతీ ద్వాదశ నామాలు, స్తోత్రాలు పారాయణ చేయాలి. నైవేద్యం: దధ్యాన్నం అంటే పెరుగన్నం, చక్కెర పొంగలి నివేదన చేయాలి.విశేషం: బెజవాడ కనకదుర్గమ్మకు నేడు సర స్వతీ మహాసరస్వతీ దేవి -
బాసర సరస్వతీ ఆలయానికి పోటెత్తిన భక్తులు
బాసర : చదువుల తల్లి బాసర సరస్వతీ ఆలయానికి భక్తులు పోటెత్తారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో నేడు కీలక ఘట్టం. బుధవారం సరస్వతి అమ్మవారి జన్మనక్షవూతమైన మూలా నక్షత్రం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున బాసర తరలి వచ్చారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూల నక్షత్రం రోజున చేసే సరస్వతి అలంకారం విశేష ప్రాధాన్యతను సంతరించుకొంటుంది. ఆరోజున పిల్లలందరూ సరస్వతిని విధిగా ఆరాధిస్తుంటారు. ఈ తల్లి అనుగ్రహం కలిగి సకల విద్యాప్రాప్తి జరగాలని కోరుకొంటారు. చదువుల తల్లి జన్మదినం సందర్భంగా ఆ సన్నిధిలో అక్షరభ్యాసం చేయిస్తే తమ చిన్నారులు విద్యావంతులు అవుతారని భక్తుల నమ్మకం. ఈక్రమంలోనే వందలాది మంది చిన్నారులకు అక్షరాభాస్య పూజలు జరుగుతాయి. మరోవైపు భక్తులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.