breaking news
Goddess Saraswati
-
మనం మరిచినా.. జపనీయులు మరువలేదు!
కోల్ కతా: మీకు తెలుసా? దాదాపు 20 మంది హిందూ దేవతలు జపాన్‌లో నిత్యం పూజలు అందుకుంటున్నారు. చదువుల తల్లి సరస్వతికి ఆ దేశంలో వందలకొద్ది ఆలయాలు ఉన్నాయి. లక్ష్మి, ఇంద్ర, బ్రహ్మ, గణేషుడు, గరుడ మొదలైన ఎంతోమంది హిందూ దేవుళ్లను జపాన్‌వాసులు కొలుస్తున్నారు. భారతీయులు మరిచిపోయిన దేవుళ్లను సైతం.. వారు మరిచిపోకుండా నిత్యం పూజలు చేస్తున్నారు. వందల ఏళ్ల కిందట భారతీయ సంస్కృతి, సంప్రదాయాలతోపాటు హిందూ దేవుళ్లు కూడా జపాన్‌కు చేరారు. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు తెగిపోయాయి. అయినా అక్కడికి చేరిన హిందూ దేవుళ్లు ఇప్పటికీ జపాన్ వాసుల పూజలందుకుంటున్నారు. ఇలాంటి ఎన్నో చారిత్రక విషయాలతో కోల్‌కతాలో ఇండియన్ మ్యూజియంలో విశిష్ఠ ప్రదర్శన ఒకటి ప్రారంభమైంది. సోమవారం ప్రారంభమై.. ఈ నెల 21 వరకు కొనసాగనున్న ఈ ఎగ్జిబిషన్లో ఇరుదేశాల సాంస్కృతిక సంబంధాలకు సంబంధించిన అరుదైన ఫొటోలెన్నింటినో ఇందులో ఉంచారు. జపాన్ ఫౌండేషన్, సినీ దర్శకుడు, చరిత్రకారుడు బినోయ్ కే బెహల్ సంయుక్తంగా ఈ ఎగ్జిబిషన్ ను ఏర్పాటుచేశారు. జపాన్ లో భారత సాంస్కృతిక మూలాలకు సంబంధించి ఎన్నో వాస్తవాలను ఈ ఫొటోలు వెల్లడిస్తాయని ఎగ్జిబిషన్ నిర్వాహకులు తెలిపారు. -
బాసర సరస్వతీ ఆలయానికి పోటెత్తిన భక్తులు
బాసర : చదువుల తల్లి బాసర సరస్వతీ ఆలయానికి భక్తులు పోటెత్తారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో నేడు కీలక ఘట్టం. బుధవారం సరస్వతి అమ్మవారి జన్మనక్షవూతమైన మూలా నక్షత్రం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున బాసర తరలి వచ్చారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూల నక్షత్రం రోజున చేసే సరస్వతి అలంకారం విశేష ప్రాధాన్యతను సంతరించుకొంటుంది. ఆరోజున పిల్లలందరూ సరస్వతిని విధిగా ఆరాధిస్తుంటారు. ఈ తల్లి అనుగ్రహం కలిగి సకల విద్యాప్రాప్తి జరగాలని కోరుకొంటారు. చదువుల తల్లి జన్మదినం సందర్భంగా ఆ సన్నిధిలో అక్షరభ్యాసం చేయిస్తే తమ చిన్నారులు విద్యావంతులు అవుతారని భక్తుల నమ్మకం. ఈక్రమంలోనే వందలాది మంది చిన్నారులకు అక్షరాభాస్య పూజలు జరుగుతాయి. మరోవైపు భక్తులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.