వ్యవసాయ బావిలో పూడిక తీత పనుల్లో అపశృతి చోటు చేసుకుంది.
వ్యవసాయ బావిలో పూడిక తీత పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. డిటోనేటర్ పేలిపోవడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కరీంనగర్ జిల్లా బోయిన్‌పల్లి మండలం అనంతపల్లి గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం ఈ విషాదం చోటు చేసుకుంది. ఓ రైతు పొలంలోని బావిలో పూడికతీత కోసం వలస కూలీ శివరాత్రి శ్రీకాంత్ (20) డిటోనేటర్ అమర్చే క్రమంలో అది చేతిలోనే పేలిపోయింది. తీవ్ర గాయాలతో అతడు మృతి చెందాడు. మృతుడు వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలానికి చెందిన వ్యక్తిగా తెలిసింది.