గుంపు నుంచి తప్పించుకుని గ్రామంలోకి వచ్చిన జింకపిల్లను గుర్తించిన స్థానికులు దాన్ని పట్టుకుని అటవీ అధికారులకు అప్పగించారు.
పిట్లం(నిజామాబాద్): గుంపు నుంచి తప్పించుకుని గ్రామంలోకి వచ్చిన జింకపిల్లను గుర్తించిన స్థానికులు దాన్ని పట్టుకుని అటవీ అధికారులకు అప్పగించారు. నిజామాబాద్ జిల్లా పిట్లం మండలం చిల్లరగి గ్రామ సమీపంలో అటవీ ప్రాంతం నుంచి గ్రామ చెరువులో నీళ్లు తాగడానికి అప్పుడప్పుడు జింకలు వస్తూంటాయి. అలాగే వచ్చిన జింకపిల్ల తిరిగి దారి మరిచి గ్రామంలోనికి వచ్చేసింది. దాన్ని గమనించిన కొందరు యువకులు పట్టుకుని గ్రామ పంచాయతి ఆఫీసులో ఉంచి అటవీ అధికారులకు సమాచారం అందించారు.