పోలీసు శాఖలో ఖాళీలు త్వరలో భర్తీ: కేసీఆర్ | Crime rate have gone down in Telangana: CM KCR | Sakshi
Sakshi News home page

పోలీసు శాఖలో ఖాళీలు త్వరలో భర్తీ: కేసీఆర్

Jan 13 2017 7:29 PM | Updated on Aug 14 2018 11:02 AM

పోలీసు శాఖలో ఖాళీలు త్వరలో భర్తీ: కేసీఆర్ - Sakshi

పోలీసు శాఖలో ఖాళీలు త్వరలో భర్తీ: కేసీఆర్

రాష్ట్రంలో పోలీసులు అద్భుతంగా పనిచేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

హైదరాబాద్: రాష్ట్రంలో పోలీసులు అద్భుతంగా పనిచేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పోలీసు శాఖపై శుక్రవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో నేరాలు తగ్గాయని ఈ సందర్భంగా తెలిపారు. క్రైమ్ రేటు తగ్గడంతో రాష్ట్రానికి 2500 పరిశ్రమలు వచ్చాయన్నారు. పోలీసు శాఖలో ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని చెప్పారు. ఖాళీగా ఉన్న కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

జస్టిస్‌ ఎన్వీ రమణకు పరామర్శ
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నివాసానికి వెళ్లి ఆయనను కేసీఆర్‌ పరామర్శించారు. ఎన్వీ రమణ మాతృమూర్తి నూతలపాటి సరోజినీదేవి బుధవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement