‘ఆ రచయితను మరణించనివ్వం’ | CPM central committee comes out in support of author | Sakshi
Sakshi News home page

‘ఆ రచయితను మరణించనివ్వం’

Jan 21 2015 12:41 AM | Updated on Aug 13 2018 9:04 PM

‘రచయితగా మరణించాను’ అని ప్రకటించిన ప్రముఖ తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్‌కు సీపీఎం కేంద్ర కమిటీ అండగా నిలిచింది.

సాక్షి, హైదరాబాద్:  ‘రచయితగా మరణించాను’ అని ప్రకటించిన ప్రముఖ తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్‌కు సీపీఎం కేంద్ర కమిటీ అండగా నిలిచింది. ఆయన్ని రచయితగా బతికించుకుంటామని ప్రకటించింది. పార్టీ కేంద్ర కమిటీ సమావేశంలో ఈ మేరకు ఓ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా తమిళనాడుకు చెందిన పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు, రచయిత వాసుకీ  ‘సాక్షి’ ప్రతినిధితో  మాట్లాడారు. ఆ రచయితను మరణించనివ్వం అని చెప్పారు.  మురుగన్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా చూస్తామని, ఆయన కలం నుంచి మరిన్ని చైతన్యవంతమైన రచనలు వెలువడేలా సీపీఎం పోరాడుతుందని వాసుకీ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement