‘బ్యూటీ’ చూసి అమ్మాయిలకు నాన్న గుర్తొచ్చి కన్నీళ్లు వస్తాయి : వీకే నరేశ్‌ | Beauty Movie Highlights Real Father-Daughter Bond with Organic, Emotional Storytelling | Sakshi
Sakshi News home page

‘బ్యూటీ’ చూసి అమ్మాయిలకు నాన్న గుర్తొచ్చి కన్నీళ్లు వస్తాయి : వీకే నరేశ్‌

Sep 16 2025 7:11 PM | Updated on Sep 16 2025 7:24 PM

Actor VK Naresh Talk About Beauty Movie

అంకిత్ కొయ్య, నీలఖి హీరో హీరోయిన్లుగా విజయ్ పాల్ రెడ్డి అడిదల, ఉమేష్ కుమార్ భన్సల్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘బ్యూటీ’. జీ స్టూడియోస్, మారుతీ టీం ప్రొడక్ట్స్, వానర సెల్యూలాయిడ్ సంయుక్తంగా ‘బ్యూటీ’ మూవీని నిర్మించారు. ఈ సినిమాకు ‘గీతా సుబ్రమణ్యం’, ‘హలో వరల్డ్’, ‘భలే ఉన్నాడే’ ఫేమ్ జె.ఎస్.ఎస్. వర్ధన్ మాటలు, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వహించారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేని ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 19న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో నేడు ఈ సినిమాలో కీలక పత్రాలు పోషించిన సీనియర్ నటుడు వీకే నరేశ్‌ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

ఈ సినిమా సోల్, ఈ సినిమా థీమ్ మాత్రమే ఈ సినిమాకు బ్యూటీ. సుబ్బు రాసిన కథని దర్శకుడు వర్ధన్ అందంగా మలిచాడు. సింఫనీ ఆఫ్ క్రాఫ్ట్ ఈ సినిమా. అన్ని కుదిరాయి దీనికి. ఇటీవల ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ కలిసి ఉన్న సినిమాలు తగ్గాయి. ఇందులో ఆ రెండూ ఉన్నాయి. ఇప్పుడు ప్రేక్షకులకు సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటే నచ్చట్లేదు. ఆర్గానిక్ గా ఉండాలి. అలా ఉంటేనే నచ్చుతుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా ఆర్గానిక్ గా లేదు అని మీకు అనిపిస్తే లక్ష రూపాయలు ఇస్తాను అని ఛాలెంజ్ చేశాను నేను.

ఇవాళ మంచి సినిమా, చెడ్డ సినిమా అని కాదు వాళ్ళు పెట్టే డబ్బులకు సంతృప్తి చెందుతున్నారా లేదా చూస్తున్నారు ఆడియన్స్. ఫ్యామిలీ మొత్తం కూర్చొని సినిమా చూడొచ్చు. ప్రతి సినిమాలో ఏదో ఒక చిన్న సమస్య ఉండొచ్చు. కానీ దీంట్లో ఏమి లేకుండా అంతగా వర్కౌట్ చేసారు. ఈ సినిమాలో ప్రస్తుత జనరేషన్ తమను తాము చూసుకుంటారు. ఈ రోజుల్లో మ్యారేజ్ గురించి ఎవరూ ఆలోచించట్లేదు. అది ఒక కమిట్మెంట్. ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్, కలిసి ఎంజాయ్ చేసి విడిపోవడం అంతే. ఇప్పటి పిల్లలకు మనం ఏమి చెప్పలేము. ఫ్రెండ్ గా ఉండటమే చేయాలి. ఒక రియలిస్టిక్ కంటెంట్ ని అందంగా చూపించారు.

నాకు కూతురు లేదు అనే లోటు ఎప్పుడూ ఉండేది. ఆ లోటు కాదు కానీ కూతురు ఉంటే ఇంత పెయిన్ పడేవాడినా అని  ఈ సినిమాలో అనుభవించాను. ఇవాళ్టి పిల్లలు ఏదో చేస్తున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు. సినిమాలో ఆ అమ్మాయిని చూసి నేను ఆ పెయిన్ అనుభవించాను.  

ఈ కథ విన్నప్పుడు నేను మెస్మరైజ్ అయ్యాను. నేను కథ విన్నాక మారుతీని ఈ సినిమా నేను చేయగలనా లేదా అని అడిగితే మీరు వంద శాతం పండిస్తారు అన్నారు.  చిన్న అపార్ట్మెంట్ లో చాలా కష్టపడి షూట్ చేసాము. ఓల్డ్ సిరీస్ లో మట్టిలో తిరిగే సీన్స్ చేశాను. ఈ సినిమాలో కథ ఆడియన్స్ పాయింట్ నుంచి తీసుకెళ్లారు. అది కనెక్ట్ అవుతుంది. సినిమాలో ఏమన్నా తప్పులు ఉంటే నేను మీ ముందుకు వచ్చి నిలబడతాను.

సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ చాలా బాగా ఇచ్చారు. చిన్న చిన్న లొకేషన్స్ లో కూడా అమేజింగ్ విజువల్స్ ఇచ్చాడు కెమెరామెన్. ఆర్ట్ డైరెక్టర్ ని కూడా మెచ్చుకోవాలి. ఈ కథని జర్నలిస్ట్ రాసాడు అంటే ఎంత రియాలిటీ ఉంటుందో చూడండి.

చాలా సినిమాల్లో అమ్మ - కొడుకుల రిలేషన్ చూపించారు కానీ తండ్రి కూతుళ్ళ రిలేషన్ చాలా తక్కువ సినిమాల్లో చూపించారు. ఈ సినిమా చూసి అమ్మాయిలకు వాళ్ళ ఫాదర్ గుర్తొచ్చి కంట్లో నీళ్లు రాకపోతే నన్ను అడగండి. ఇంట్లో అన్ని అమ్మ అయితే ఇంటికి కాంపౌండ్ వాల్ లాంటివాడు నాన్న. ఆ ఎమోషనే బ్యూటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement