ప్రాణహిత చేవెళ్లకు జాతీయ హోదా లేకుండా తెలంగాణ ప్రభుత్వం చేసిందని సీపీఐ జిల్లా కార్యదర్శి కలవేణి శంకర్ మండిపడ్డారు.
► ప్రాణహిత చేవెళ్లకు జాతీయ హోదా లేకుండా చేసిన ప్రభుత్వం
► ప్రాజెక్ట్ మార్పుతో జిల్లా ప్రజలకు అన్యాయం
► సీపీఐ జిల్లా కార్యదర్శి కలవేణి శంకర్
ఆదిలాబాద్: ప్రాణహిత చేవెళ్లకు జాతీయ హోదా లేకుండా తెలంగాణ ప్రభుత్వం చేసిందని సీపీఐ జిల్లా కార్యదర్శి కలవేణి శంకర్ మండిపడ్డారు. సోమవారం స్థానిక ఏఐటీయూసీ యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్ట్ మార్పుతో జిల్లాకు ఎంతో అన్యాయం చేశారని మండిపడ్డారు.
జిల్లాల ఏర్పాటులో ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలను భాగస్వాములను చేస్తామని ప్రకటించిన కేసీఆర్ అందుకు విరుద్ధంగా నియంత నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కలిసి వచ్చే వామపక్ష పార్టీలు, జేఏసీతో కలిసి ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. పార్టీకి జిల్లా వ్యాప్తంగా 227 శాఖలు ఉన్నాయని జూలై 15 నుంచి అగస్టు చివరి వారం వరకు గ్రామస్థాయిలో ఉండి నియోజక వర్గాల స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్‌లో జిల్లా మహసభలను నిర్వహించి అక్టోబర్‌లో రాష్ర్ట మహసభలను వరంగల్‌లో నిర్వాహిస్తామన్నారు. పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్.తిరుపతి, సహయ కార్యదర్శి డి.సత్యనారాయణ, భీమనాధుని సుదర్శన్, లింగమూర్తి, పట్టణ కార్యదర్శి ఒడ్నాల శంకర్, రంగు మధునయ్య, జనార్ధన్, బాపు తదితరులున్నారు.