‘సేవ’కు సత్కారం

COVID 19 Awards For Blood Donation in Lockdown Hyderabad - Sakshi

మున్నెన్నడూ ఎరుగని రోగమది. కనీ విని ఎరుగని రీతిలో కష్టాలను, నష్టాలను చవిచూపిస్తున్న కరవు కాలమిది. ఒకవైపు బతుకు బండి సాగేదెలా అనే బెంగ.. మరోవైపు నలువైపులా చీకట్లు ముసురుకుంటున్న వేళ కొన్ని మానవత్వపు చిరుదీపాలు వెలుగుతున్నాయి. మందేలేని వ్యాధి అంటుతుందేమోననే భయంతో చేతనైనంత సాయం చేçస్తూ వెలుగు పంచుతున్నారు. అలాంటి చిరు దీపాలకు చిరు సత్కారం అందనుంది. కరోనా విపత్కర పరిస్థితుల్లో సమాజానికి సేవ చేసిన పలువురికి ప్రముఖ సోషల్‌ ఆక్టివిస్ట్‌ సంపత్‌ కుమార్‌ ఆధ్వర్యంలో కోవిడ్‌–19 ఫైటర్స్‌ అవార్డ్‌ ఇవ్వనున్నారు.

సాక్షి, సిటీబ్యూరో: ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను చూశాం. మరెన్నో ప్రాణాంతక వ్యాధులను దాటుకుని వచ్చాం. అయితే మునుపెన్నడూ లేని విధంగా కేవలం ఒక వ్యాధి ప్రపంచాన్నే ఇంటికి పరిమితం చేయడమే కాకుండా మనిషికి మనిషికి దూరాన్ని సైతం పెంచింది. కరోనా వ్యాధి సోకి మృత్యువాత పడినవారు కొందరైతే, దాని అవస్థల నుంచి కోలుకుంటున్న వారు మరికొందరు. అయితే ఇది ప్రత్యక్ష ప్రభావం మాత్రమే... మరో వైపు పరోక్షంగా ఇది సృష్టిస్తున్న విధ్వంసం అసాధారణం. 

లాక్‌డౌన్‌.. ఆకలి అప్‌
కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో చేతిలో పని లేక, అవసరానికి డబ్బులు అందక, కనీసం తినడానికి తిండి దొరక్క పస్తులుంటున్న ఆకలి కడుపులెన్నో. ఈ తరుణంలో ఎన్నో ఆపన్న హస్తాలు అన్నార్తులకు ఆసరాగా నిలుస్తున్నాయి. ఉన్నంతలో సాటి వారికి చేయూత అందిస్తూ ఆదుకుంటున్నారు. ఈ కష్టకాలంలో పలు స్వచ్ఛంద సేవా సంస్థలు చేస్తున్న కృషి నభూతో నభవిష్యత్‌. ముఖ్యంగా అన్నార్తులకు ఆహారం, పేద కుటుంబాలకు నిత్యావసరాలు అందిస్తూ తోడుగా నిలుస్తున్నారు. ఈ సేవలో కరోనా సోకే ప్రభావం ఉన్నప్పటికీ తగు జాగ్రత్తలు తీసుకుంటూ, ఒక విధంగా ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ సేవ చేస్తున్నారు. ఎంతో మందికి సహాయం చేయాలని ఉన్నా లాక్‌డౌన్‌ కారణంగా బయటికి రాలేని పరిస్థితి ఉండటంతో వారందరూ సేవలో నిమగ్నమైన స్వచ్ఛంద సేవా సంస్థలకు, స్వచ్ఛంద సేవకులకు డబ్బులు పంపించి ఉదారతను చాటుకుంటున్నారు. మరికొందరు స్వయంగా ముందుకొచ్చి తోచిన సహాయం చేస్తున్నారు. ఈ విధంగా సేవ చేసిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన 100 మందిని ఈ కోవిడ్‌–19 ఫైటర్‌ అవార్డ్స్‌తో పాటు నగదు బహుమతితో, ప్రముఖుల చేతుల మీదుగా సత్కరించనున్నామని సంపత్‌ కుమార్‌ తెలిపారు. వీరిలో విభిన్న రకాలుగా సేవ చేసిన వారిని ఎంచుకున్నామన్నారు.

సంపత్‌ కేరాఫ్‌ చారిటీ...
సమాజంలో ఎవరికి ఏ అవసరమున్నా నేనున్నాను అని ముందుంటాడు సంపత్‌ కుమార్‌. అంతేకాకుండా ఇప్పటి వరకు 211 సార్లు రక్తదానం చేసి అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమున్నవారికి అండగా నిలిచి రికార్డ్‌ సృష్టించాడు. లాక్‌డౌన్‌లో కూడా వ్యక్తిగతంగా దాదాపు 2000 కుటుంబాలకు బియ్యం, కూరగాయలు, ఇతర నిత్యావసరాలు అందించాడు. దానితో పాటు సోషల్‌ మీడియాలో ఎఫ్‌3 ఛాలెంజ్‌ని (ఫిడ్‌ ఫైవ్‌ ఫ్యామిలీస్‌) విసిరి, దాని ద్వారా పోగైన లక్ష రూపాయలతో సిటీలోని నిరుపేదలకు నిత్యావసర వస్తువులను అందించాడు. అంతేకాకుండా ఈ క్లిష్టపరిస్థితుల్లో తలసేమియాతో బాధ పడేవారికి రక్త నిల్వల కొరత ఉండకూడదని, తన సోసల్‌ మీడియా ఫాలోవర్స్‌ ద్వారా 700 యూనిట్‌ల రక్తాన్ని ముందుగానే సమకూర్చాడు. దీని కోసం ప్రత్యేకంగా బ్లడ్‌ అంబులెన్స్‌ని ఏర్పాటు చేశాడు. అలాగే నగరంలో ఎవరికి రక్తం అవసరమున్నా తనకున్న ఫాలోవర్స్‌ ద్వారా వెంటనే అందిస్తూ అందరికి ఆదర్శంగా, ఆపద్భాందవుడిగా నిలుస్తున్నాడు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

10-04-2021
Apr 10, 2021, 13:27 IST
ఎమ్మెల్యే  గొట్టిపాటి రవి, మాజీ మంత్రి జవహర్, వంగలపూడి అనిత, ఎమ్మెల్సీ సంధ్యా రాణిలకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో టీడీపీ...
10-04-2021
Apr 10, 2021, 11:16 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. సెకండ్‌ వేవ్‌లో పలురాష్ట్రాల్లో శరవేగంగా విస్తరిస్తోంది. రోజువారీ వరుసగా లక్షకేసులకు తగ్గడం లేదు....
10-04-2021
Apr 10, 2021, 10:15 IST
గురువారం ఒక్కరోజే కరోనాతో 794 మంది ప్రాణాలు కోల్పోయారు. 
10-04-2021
Apr 10, 2021, 09:52 IST
ముంబై :  మహారాష్ట్రలో అంతకంతకూ కరోనా కేసులు పెరుగుతూ, సినిమా షూటింగులు ఆగిపోతున్న నేపథ్యంలో అక్కడి సినీ కార్మికుల సమాఖ్య...
10-04-2021
Apr 10, 2021, 09:47 IST
మాస్క్‌ లేకుండా తిరుగుతున్న వారి ఫొటోలను తీసుకొని ఆన్‌లైన్‌లో జరిమానా రశీదును అందజేస్తున్నారు. చెల్లించని వారిని కోర్టులో ప్రవేశపెట్టి 51(ఏ)...
10-04-2021
Apr 10, 2021, 09:43 IST
ఏప్రిల్‌లో పాజిటివ్‌ కేసులు విశ్వరూపం దాలుస్తాయి, మే ఆఖరుకు తగ్గుముఖం పట్టి ఊరటనిస్తాయని వైద్యనిపుణులు ధైర్యం చెబుతున్నారు.
10-04-2021
Apr 10, 2021, 08:35 IST
టీవీ సీరియళ్ల షూటింగ్‌లను రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 
10-04-2021
Apr 10, 2021, 08:29 IST
కోవిడ్‌ విస్తరణ బెంగళూరులో వాయువేగంతో సాగుతోంది. రాజధానిలో కొత్తగా 5,576 కేసులు నమోదు అయ్యాయి.
10-04-2021
Apr 10, 2021, 05:59 IST
న్యూఢిల్లీ:  దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా కొనసాగుతోంది. ఆక్స్‌ఫర్డ్‌–ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసి కోవిషీల్డ్, భారత్‌ బయోటెక్‌ సంస్థ రూపొందించిన...
10-04-2021
Apr 10, 2021, 05:07 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియ సాగుతోంది. ప్రభుత్వాస్పత్రులు, ప్రైవేటు ఆస్పత్రులతో పాటు గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో వ్యాక్సిన్‌...
10-04-2021
Apr 10, 2021, 04:53 IST
న్యూఢిల్లీ:  దేశంలో కరోనా రోజురోజుకీ ఉధృతరూపం దాలుస్తోంది. వరసగా మూడోరోజు లక్షకు పైగా కేసులు వెలుగులోకి వచ్చాయి. గత 24...
10-04-2021
Apr 10, 2021, 04:02 IST
సాక్షి, అమరావతి: రాజమండ్రి సెంట్రల్‌ జైలులో నెల రోజుల్లో 22 మంది ఖైదీలకు కరోనా సోకింది. దీంతో జైళ్ల శాఖ...
10-04-2021
Apr 10, 2021, 02:55 IST
సాక్షి, అమరావతి: ఏప్రిల్‌ 11 నుంచి 14 వరకు ‘టీకా ఉత్సవ్‌’ను దిగ్విజయంగా నిర్వహించేందుకు రాష్ట్రానికి వెంటనే 25 లక్షల...
10-04-2021
Apr 10, 2021, 02:50 IST
రైలు సేవలను తగ్గించడానికి కానీ ఆపడానికి  ఎటువంటి ప్రణాళిక లేదని,  అవసరమైతే  పెంచుతామని రైల్వే బోర్డు చైర్మన్‌ సునీత్‌ శర్మ...
10-04-2021
Apr 10, 2021, 02:07 IST
మే 17వ తేదీ నుంచి టెన్త్‌ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అసలు పదో తరగతి విద్యార్థులకు వార్షిక...
10-04-2021
Apr 10, 2021, 01:58 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుండటంతో దాన్ని కట్టడి చేసేందుకు వైద్య, ఆరోగ్యశాఖ అదేస్థాయిలో ముందుకెళ్తోంది. వైరస్‌ నిర్ధారణ పరీక్షలు,...
09-04-2021
Apr 09, 2021, 18:11 IST
అంబులెన్స్‌లో ఉన్న వ్యక్తికి కరోనా. నాకు కాదు
09-04-2021
Apr 09, 2021, 12:12 IST
కోవిడ్‌ చికిత్స పేరుతో ప్రైవేట్‌ ఆస్పత్రులు దోపిడీ చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని, మాస్క్‌ పెట్టుకోని వారి పట్ల కఠినంగా...
09-04-2021
Apr 09, 2021, 11:12 IST
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా రెండోదశలో కరోనా విలయం కొనసాగుతోంది.  రోజు రోజుకు  కొత్త రికార్డు స్థాయిలతో కరోనా వైరస్‌ పంజా విసురుతోంది. ...
09-04-2021
Apr 09, 2021, 10:26 IST
న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ కోరలు చాస్తోంది. తగ్గుముఖం పట్టిందన్న కరోనా మరోసారి పంజా విసురుతుండటంతో...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top